Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనిర్వచనీయ అనుభూతి రామేశ్వర సందర్శనం

అనిర్వచనీయ అనుభూతి రామేశ్వర సందర్శనం
, శనివారం, 6 సెప్టెంబరు 2008 (16:13 IST)
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో గల రామేశ్వరాన్ని సందర్శిస్తే ఓ అద్భుతమైన, అనిర్వచనీయమైన అనుభూతి మన సొంతమవుతుంది. ఓ పుణ్యక్షేత్రంగా, ఓ పర్యాటక స్థలంగా విలసిల్లుతోన్న రామేశ్వరంలో పర్యాటకులకు కనువిందు చేయడానికి అనేక విశేషాలున్నాయి.

దాదాపు 62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పడిన ఈ ద్వీప ప్రాంతములో రామనాథ స్వామి ఆలయం ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అలాగే ఇక్కడ ఉన్న కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి, విభిషనాలయం లాంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

రామనాథ స్వామి ఆలయం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఈ రామనాథ స్వామి దేవాలయం ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది. సముద్రానికి దగ్గర్లో నిర్మించినబడిన ఈ ఆలయం 12వ శతాబ్ధంలో నిర్మించబడినట్టు చెబుతారు. దాదాపు 865 అడుగుల పొడవు, 657 అడుగుల వెడల్పుతో నిర్మించబడిన ఈ ఆలయం భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా విలసిల్లుతోంది.

ఈ దేవాలయానికి పక్కనే ఉన్న మూడు మహా మండపాలు నాలుగువేల అడుగుల పొడవుతో ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఈ ప్రాకారాల్లో రామేశ్వరుడు, పార్వతీదేవి ఆలయాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ రుచులను కల్గిన 22 బావులున్నాయి. అలాగే ఈ ఆలయ మండపాల్లో వరసగా నిర్మించబడిన శివలింగాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.


ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నీటిలో తేలే రాళ్లు ఉండడం విశేషం. ఆనాడు రాముడు సీతా దేవి కోసం లంకకు వారధి నిర్మించ తలపెట్టినప్పుడు ఈ రాళ్లతోనే వారధి నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.

క్షేత్ర విశేషాలు
సీతాదేవిని రావణుడు అపహరించుకుని లంకకు వెళ్లిపోయినపుడు రాముడు ఈ రామేశ్వరం ప్రాతం నుంచే లంకకు వారథి నిర్మించి అక్కడకు వెళ్లి రావణుడిని సంహరించి సీతను వెనక్కి తెచ్చుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. రావణుడిని చంపిన తర్వాతా ఆ హత్యాపాపాన్ని కడిగేసుకోవడానికే రాముడు ఈ రామేశ్వరంలో రామనాధుని ప్రతిష్టించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి.

రవాణా సౌకర్యాలు
ముందుగా చెప్పినట్టు రామేశ్వరం ఓ దీవి. ఇక్కడకు చేరుకోవడానికి సముద్రం మీదుగా నిర్మించబడిన రైలు వంతెన, బస్సు వంతెన అందుబాటులో ఉన్నాయి. రామేశ్వరం నుంచి శ్రీలంక చాలా దగ్గరగా కన్పిస్తుంది. శ్రీలంక రాజధాని అయిన కొలంబో నగరము రామేశ్వరానికి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu