Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌లోని మానవ నిర్మిత 'ఇంద్రలోకం'

దుబాయ్‌లోని మానవ నిర్మిత 'ఇంద్రలోకం'
, శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (20:19 IST)
FileFILE
అరబ్ ఎమిరేట్స్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది.. విలాసవంతమైన జీవితం. అందులోనూ.. ఎడారి ప్రాంతమైన దుబాయ్‌ ప్రాంత లగ్జరీని స్వయంగా అనుభవించాల్సిందే. ఆకాశాన్ని తాకే భవనాలు, స్వర్గాన్ని తలపించే అందాలు ఈ ప్రాంతం సొంతం. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇదో భూలోకంలోని ఇంద్రలోకం.

ఇలాంటి దుబాయ్‌లో ఓ మానవ నిర్మిత కట్టడం ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు రెండు బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మితమైన ఈ భవనం... చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. పామ్ ట్రీ ఆకారంలో నిర్మితమైన ఈ కట్టడం.. 113 ఎకరాల విస్తీర్ణంలో పర్శియన్ గల్ఫ్ తీరంలో కొలువైవుంది. గోడలనే ఆక్వేరియంగా తీర్చి దిద్దారు. ఈ ఆక్వేరియంలలో సుమారు 65 వేల చేపల రకాలు ఉన్నాయి.

ఇక్కడ పిల్లలు, పెద్దలు సేద తీరేందుకు వీలుగా.. ఓషన్ పార్కులు, థీమ్స్, రెస్టారెంట్స్.. ఒకటేంటి సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి హోటల్‌లో ఒక్క రోజు బస చేయాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా..? అక్షరాలా 25 వేల డాలర్లు. వామ్మో...! ఇంత అని నోరెళ్ళ బెట్టారా? మరి భూలోక ఇంద్రలోకమంటే మాటలా మరి...!!!

Share this Story:

Follow Webdunia telugu