Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవాలో పర్యాటకుల భద్రతకు ముప్పులేదు: బ్రిటన్

గోవాలో పర్యాటకుల భద్రతకు ముప్పులేదు: బ్రిటన్
, శుక్రవారం, 18 జులై 2008 (10:56 IST)
FileFILE
బ్రిటిష్ యువతి స్కార్లెట్ కీలింగ్ హత్య గోవా ప్రతిష్టను మసకబార్చింది కాని బ్రిటన్‌లోని పర్యాటక నిర్వాహకులు మాత్రం గోవాకు తమ బుక్కింగుల్లో పెద్దగా మార్పులేవీ కనిపించలేదని ప్రకటించారు. గోవా ఇప్పటికీ సురక్షిత ప్రాంతమేనని వీరు భావిస్తుండటం గమనార్హం. కీలింగ్ హత్య, గోవాలో సెలవులను గడపాలని వచ్చిన బ్రిటిష్ యువతి.. అల్లరి మూక బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనతో గోవా పేరు ప్రఖ్యాతులు మసకబారాయని ప్రముఖ పర్యాటక రంగ ప్రచురణ తెలిపింది.

గోవాలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తాము విశ్వసిస్తున్నామని... గతంలో లాగే తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని బ్రిటన్ పర్యాటక కార్యకలాపాల సంస్థ స్పష్టం చేసింది. ఈ విషయంపై బ్రిటన్‌లో లీడింగ్ టూర్ ఆపరేటర్ అయిన సొమాక్ సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్ సొఫాత్ మాట్లాడారు.

గోవాకు వెళితే భద్రతకు కొదవలేదు... అయితే ఈ పర్యటనకు వెళ్లే ముందు పర్యాటకులకు కొన్ని సాధారణ విషయాలపై అవగాహన కల్పించడం ఎంతో మంచిదని సొఫాత్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో స్కార్లెట్ తన పరిమితులను గుర్తించలేదు. అలాగే అల్లరిమూకలతో స్నేహం ఆమె ప్రాణాలనే హరించిందని విశ్లేషించారు. గత ఏడాది సొమాక్ నుంచి 12వేల మంది పర్యాటకులను గోవాకు పంపామని... వారిలో ఎవరూ తమకు రక్షణ లేదని భద్రత కల్పించాల్సిందిగా కోరలేదని సొఫాత్ వివరించారు.

కొన్ని ఫిర్యాదులు వచ్చాయి... అయితే అవన్నీ కూడా బీచ్‌లో దొంగతనానికి సంబంధించి మాత్రమే వచ్చాయన్నారు. గోవాలో ఆకట్టుకునే వాటిల్లో భద్రత కూడా ఒక అంశమని... ఎంత రాత్రయినా బీచ్ నుండి ఏ హోటళ్లకైనా తిరగొచ్చని తెలిపారు. ఏ సమయంలోనైనా పైన చెప్పిన విధంగా స్వేచ్ఛగా చేసి చూపగలమని సొఫాత్ ధీమా వ్యక్తం చేశారు. కానీ నైరోబీ లేదా లండన్‌లోని ఇతర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బయట గడపటం సాధ్యం కాదని వెల్లడించారు.

సొమాక్ మేనేజింగ్ డైరెక్టర్ ప్లాటన్ లోయ్‌జోవ్ మాట్లాడుతూ స్కార్లెట్ విషయం నిజానికి ఓ బాధాకరమైన సంఘటన.. అదలా దురదృష్ణవశాత్తు జరిగిపోయిందే గాని గోవాలో పర్యాటకుల భద్రతకు ఎలాంటి కొదవాలేదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామానికి కారకులైన వారిని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకులకు సమస్యలు వస్తున్నాయంటే... ప్రధానంగా మత్తుపదార్ధాలకు అలవాటు పడటమేనన్నారు. దీన్ని బట్టి పర్యాటకులు ఎక్కడికి వెళ్లినా సరే ఇలాంటి మత్తుపదార్ధాల జోలికి వెళ్లకుండా ఉండటం ఎంతో మంచిదని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu