Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2010లో ముత్తయ్య 800 వికెట్ల రికార్డును పడగొట్టిన వేళ..!

2010లో ముత్తయ్య 800 వికెట్ల రికార్డును పడగొట్టిన వేళ..!
, శుక్రవారం, 31 డిశెంబరు 2010 (18:54 IST)
FILE
అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి 1983వ సంవత్సరంలోనే అడుగుపెట్టి, అతి స్వల్ప కాలంలోనే ప్రపంచకప్‌ను సాధించి, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ వంటి సూపర్ బౌలర్‌ను, జయసూర్యలాంటి అత్యున్నత బ్యాట్స్‌మెన్‌ను ఇచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టుకు 2010 మంచి ఫలితాలనిచ్చింది.

27 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఒకసారి విశ్వవిజేతగానూ, రెండుసార్లు వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి, ఒకసారి ఫైనల్లోకి ప్రవేశించిన రికార్డు కలిగివున్న శ్రీలంక క్రికెట్‌కు 2010 మరువలేని సంవత్సరం. ఈ సంవత్సరంలో అత్యధిక గెలుపులు, ఓటములు లేకపోయినా.. శ్రీలంక నిలకడగా రాణిస్తుందనే చెప్పాలి. ఈ ఏడాది శ్రీలంక అత్యధిక మ్యాచ్‌ల్లో ఆడకపోవడం ఒకందుకు ఆ జట్టుకు మేలు చేసిందనే చెప్పాలి.

భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను తమ సొంగడ్డపై డ్రా చేసిన శ్రీలంక ఆ తర్వాత కాస్త వెనకబడింది. ఈ టెస్టు సిరీస్‌లో ఒక టెస్టును టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అద్భుత డబుల్ సెంచరీ ద్వారా డ్రా ముగిసింది. ఈ టెస్టు సిరీస్‌లోనే స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ముఖ్యంగా తొలి టెస్టులో 8 వికెట్లు సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే 800 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు.. అద్భుతమైన రికార్డుతో తాను ఆడిన చివరి టెస్టులో జట్టును కూడా గెలిపించాడు. కానీ ఈ ఏడాది శ్రీలంక క్రికెట్‌కు బాధ కలిగించిన విషయమేమిటంటే.. స్పిన్ మాంత్రికుడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడమే..!.

అటు పిమ్మట ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌‌ను శ్రీలంక ఓడించింది. అయితే జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌‌ను మాత్రం శ్రీలంక గెలుచుకుంది. భారత్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడిన ట్రై-సిరీస్‌ ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ సేనను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది.

అలాగే ఆస్ట్రేలియాలో పర్యటించిన శ్రీలంక జట్టు ఒక ట్వంటీ-20లోనూ, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఈ సిరీస్‌ల్లో మలింగ, మాథ్యూస్‌ల అద్భుత ఆటతీరుతో ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌ ఓటమిని గెలుపుగా మలిచి, కంగారూలను మట్టికరిపించింది.

ఇదేవిధంగా ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే ఓడించి 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరిగా వెస్టిండీస్ జట్టు లంకలో పర్యటన చేపట్టిన సందర్భంగాలో వర్షంతో టెస్టు సిరీస్‌‌కు అంతరాయం కలిగింది. అయితే తొలి టెస్టులో క్రిస్ గేల్ ట్రిపుల్ సెంచరీతో శ్రీలంకను ఓటమి అంచుల్లో నెట్టాడు. కాబట్టి 2010 శ్రీలంక క్రికెట్‌కు మంచి ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి.

webdunia
FILE

ఇక 2010లో ఇతర క్రికెట్ జట్ల ఆటతీరు ఎలా ఉందంటే..?
భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ప్రపంచ వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన జట్ల గురించి చెప్పాలంటే.. పాకిస్థాన్‌కు 2010 ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. ఒకవైపు పేలవమైన ఆటతీరు, మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం ఆ జట్టును ఏ మాత్రం వదిలిపెట్టేలా లేదు.

ఇంగ్లాండ్‌లో ఒక టెస్టులో విజయం, ఆస్ట్రేలియాతో ఒక గెలుపు, దక్షిణాఫ్రికాపై నెగ్గలేక ఒక మ్యాచ్ డ్రా మాత్రమే ఈ ఏడాది పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫలితాలు. వన్డే పోటీల్లోనూ ఆశించిన స్థాయిలో పాక్ క్రికెటర్లు రాణించలేకపోయారు. క్రికెట్ కానీ వ్యవహారాల ప్రభావం, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసమర్థత పాలన, స్పాట్ ఫిక్సర్ల బెడద వంటి కారణాలతో పాక్ క్రికెటర్లు తమ ఆటతీరుపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు.

ఇదేకారణాలతోనే పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆసిఫ్, అమీర్, సల్మాన్ భట్ వంటి అద్భుత క్రీడాకారులను కోల్పోయింది. అలాగే స్పాట్ ఫిక్సర్ల బెదిరింపులతో యువ వికెట్ కీపర్ హైదర్ ఏకంగా తన క్రికెట్ కెరీర్‌కే స్వస్తి పలికేశాడు. కాబట్టి ఈ ఏడాది పాకిస్థాన్‌ క్రికెట్ అంతా స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం చుట్టూ తిరిగిందనే చెప్పాలి. ఈ వ్యవహారం నుంచి పాకిస్థాన్ గట్టెక్కడం కాస్త కఠినతరమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెస్టిండీస్ జట్టు సంగతికొస్తే.. వ్యకిగత రికార్డులు మినహా జట్టు పెద్దగా ఏమీ సాధించలేదు. క్రిస్ గేల్ ట్రిబుల్ సెంచరీ మాత్రమే ఈ ఏడాది వెస్టిండీస్‌కు లభించిన కానుక. కానీ బంగ్లాదేశ్ అద్భుత తీరుతో రాణిస్తోంది. న్యూజిలాండ్‌ను 4-0 తేడాతో ఓడించి షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ రెండు వన్డేల్లో గెలిచింది.

తమీమ్ ఇక్భాల్, ఆల్ రౌండర్ షాకిబ్ అల్ హసన్ అద్భుత ఆటతీరు, అద్భుల్లా ఆల్‌రౌండర్ ప్రదర్శన ఆ జట్టును శ్రీలంక జట్టులా నిలబెట్టింది. మొత్తానికి 2010వ సంవత్సరం మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే కలిసొచ్చింది. ధోనీ కెప్టెన్సీ సారథ్యంలో భారత్ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా ఓడిపోలేదని చెప్పుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu