Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో ఉగ్రవాదుల దాడులు... చరిత్ర

భారత్‌లో ఉగ్రవాదుల దాడులు... చరిత్ర

Gulzar Ghouse

FileFILE
ఉగ్రవాదం అంటే ఉగ్రం అనే పదం నుంచి పుట్టింది. దీనికి మరో పేరు భయం. భయం అనేది ఓ మానసిక ప్రతిచర్య. ఉద్రేకానికి లోనై తమను తాము రక్షించుకోవడం కోసం చేసే పని. సమాజ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడమే ఉగ్రవాదం. మానసిక కోణంలో చూస్తే.. రుగ్మత, సామాజిక పరంగా చూస్తే పైశాచికత్వం. మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ఉగ్రవాదులు అంటే నాయకులకు గుర్తుకు వచ్చేది ముసల్మానులు.

ఈ ముసల్మానుల మతం ఇస్లాం. ఇస్లాం దృష్టిలో ఉగ్రవాదం అనే పదానికి తావు లేదు. ఇస్లాం మత గ్రంథాలలో ఉగ్రవాదానికి పాల్పడమని, ప్రజల ప్రాణాలు తీయమని చెప్పలేదు. ప్రేమ, త్యాగం, మానవత్వానికి కట్టుబడి ఉండమని ఇస్లాం మతం చెబుతోంది. ఇస్లాం మతంలో హింసకు, ఉగ్రవాదానికి చోటు లేదని మతపెద్దలు పేర్కొన్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఉగ్రవాదానికి దేశంలో జరిగిన దాడుల వివరాలను పరిశీలిద్దాం.

26 నవంబరు, 2008: ముంబైలో సిఎస్టీ రైల్వే స్టేషనుతోసహా తాజ్, ట్రిడెంట్, నారిమన్ హోటళ్లపై ఉగ్రవాద దాడులలో సుమారు 178 మంది బలయ్యారు. 300 మందికి పైగా గాయపడ్డారు
30 అక్టోబరు, 2008: అస్సోంలోని 18 మంది ఉగ్రవాదులు వివిధ ప్రాంతాలలో జరిపిన దాడులలో 45 మంది చనిపోగా 100 మంది గాయపడ్డారు.
21 అక్టోబరు, 2008: మణిపూర్ పోలీస్ కమాండో కాంప్లెక్స్ సమీపంలో జరిగిన బాంబు విస్ఫోటనంలో 17 మంది చనిపోయారు.
29 సెప్టెంబరు, 2008: గుజరాత్‌లోని మోదాసాలో జరిగిన పేలుడులో ఎవరికీ ఏ హానీ కలగకపోగా అదే రోజు మహారాష్ట్రలోని మాలెగావ్‌లోజరిగిన పేలుళ్ళలో ఐదు మంది చనిపోయారు.

28 సెప్టెంబరు, 2008: ఢిల్లీలోని మెహరౌలీ ప్రాంతంలో జరిగిన పేలుడులో ముగ్గురు తనువు చాలించారు.
13 సెప్టెంబరు, 2008: రాజధాని ఢిల్లీలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో జరిగిన వరుస పేలుళ్ళతో 26 మంది మృత్యువాతపడ్డారు.
26 జులై, 2008 అహ్మదాబాద్‌‌లో 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబులు పేలడంతో ఏకంగా 56 మంది చనిపోగా 200 మంది గాయపడ్డారు.
25 జులై, 2008: బెంగళూరులో ఒక వ్యక్తి చనిపోగా 15 మంది గాయపడ్డారు.
13 మే, 2008: జైపూర్‌లో ఏడు చోట్ల బాంబులు పేలడంతో 63 మంది ప్రాణాలు కోల్పోయారు.

25 ఆగస్టు, 2007 హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు లోపల...బయట జరిగిన మూడు పేలుళ్లలో 40 మంది చనిపోయారు.
18 మే, 2007: హైదరాబాద్‌లోని ఓ మసీదులో బాంబు పేలడంతో 11 మంది చనిపోయారు.
19 ఫిబ్రవరి,2007: భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో రెండు బాంబులు పేలడంతో 66 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది పాకిస్థానీయులే ఉన్నారు.


8 సెప్టెంబరు, 2006: ముంబయి నుండి 260 కి.మీ.దూరంలో ఉన్న మాలెగావ్‌లోని ఒక మసీదులో బాంబులు ఒకటి తర్వాత ఒకటి పేలడంతో 32 మంది చనిపోయారు .
11 జులై, 2006: ముంబయిలోని రైల్వే స్టేషన్లు, లోకల్ రైళ్లలో జరిగిన ఏడు బాంబు పేలుళ్లలో 180 మందికి పైగా చనిపోయారు.
7 మార్చి, 2006: బెనారస్‌లో మూడు చోట్ల జరిగిన బాంబు దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు.

29 అక్టోబరు, 2005: ఢిల్లీలో రద్దీగా ఉన్న బజారుల్లో మూడు చోట్ల జరిగిన దాడుల్లో 66 మంది చనిపోయారు.
15 ఆగస్టు, 2004: అస్సోంలో జరిగిన బాంబు దాడుల్లో 16 మంది చనిపోయారు. వీరిలో స్కూలు పిల్లలే అధికం.
25 ఆగస్టు, 2003: ముంబయి‌లో రెండు కారు బాంబు పేలుళ్లలో 60 మంది చనిపోయారు.
13 మార్చి, 2003: ముంబయి‌లో ఒక లోకల్‌ రైల్లో జరిగిన బాంబుదాడిలో 11 మంది చనిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu