Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వానికి మార్గదర్శకాలు... ఆదేశ సూత్రాలు

ప్రభుత్వానికి మార్గదర్శకాలు... ఆదేశ సూత్రాలు
FileFILE
భారత రాజ్యాంగ వ్యవస్థలో ఆదేశ సూత్రాలు కీలకమైనవి. దేశ పౌరుని పట్ల ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతలను ఈ ఆదేశ సూత్రాలు వివరిస్తాయి. వీటిని ఐరిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించిన భారత శాసన కర్తలు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ ఆదేశిక సూత్రాలను ప్రధానంగా మూడు రకాలుగా పేర్కొంటారు. వీటిలో ఒకటి... గాంధేయ సిద్ధాంతానికి అనుగుణమైన నియమాలు, రెండు... శ్రేయోరాజ్య నిర్మాణానికి తోడ్పడే నియమాలు, మూడు... అంతర్జాతీయ స్నేహ సంబంధాలకు అవసరమైన నియమాలు. వీటిలో కొన్ని ముఖ్యమైన ఆదేశ సూత్రాల గురించి తెలుసుకుందాం.

* పౌరుల జీవనోపాధికి, సమిష్టి సౌభాగ్యానికి, స్త్రీ పురుషులకు సమాన వేతనాలు, కార్మికులకు ఆరోగ్య రక్షణ కల్పనకు కృషి చేయడం.
* కార్మికులకు తగిన వేతనాలు, ప్రామాణిక జీవనం, వైజ్ఞానిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం.
* చారిత్రాత్మక, జాతీయ ప్రాముఖ్యత గల కట్టడాలను, చిహ్నాలను కాపాడటం.
* దేశంలోని పేదరిక నిర్మూలనకు కుటీర పరిశ్రమలు నెలకొల్పి, పేదల్లో ఆర్థిక స్థోమత పెంచడం.
* ప్రజా సంక్షేమ సాధనకు అవసరమైన ఆర్థిక, సాంఘీక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చే సమసమాజాన్ని స్థాపించడం.

* దేశంలోని గ్రామ పంచాయతీలను స్వపరిపాలనా సంస్థలుగా మార్చడం.
* మద్యపానం, పొగతాగడం, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను నిషేధించడం.
* సమాజంలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల, తెగల వారికి విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించి, వారు సాంఘీక అన్యాయానికి గురికాకుండా చూడటం.
* దేశంలోని న్యాయ శాఖకు, కార్యనిర్వాహక శాఖకు ఎలాంటి సంబంధం లేకుండా వేరుచేయడం.
* ఉచిత న్యాయ సలహాలు, సహాయాన్ని కల్పించడం.
* భిన్న ప్రాంతాల్లోని వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య ఎలాంటి తారతమ్య భేధాలు లేకుండా చూసి, ఆదాయంలో అసమానతలను వీలైనంత మేరకు తగ్గించడం.

Share this Story:

Follow Webdunia telugu