Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాంచిలో బౌద్ధ క్షేత్రం

సాంచిలో బౌద్ధ క్షేత్రం
, సోమవారం, 3 మార్చి 2008 (17:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రమైన సాంచి జిల్లాలో దేశంలోనే తొలి బౌద్ధక్షేత్రం ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర పురావస్తు శాఖ, మధ్యప్రదేశ్ పర్యాటక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన బౌద్ధ స్థూపాలకు వంద మీటర్ల దూరంలో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

FileFILE
భారత్, మలేషియా, సుమాత్రా, జావా, ఇండోనేషియా, జపాన్, మయన్మార్, శ్రీలంక తదితర దేశాల నుంచి వివిధ రకాల మోడళ్లు గల స్ధూపాలను ఈ పర్యాటక క్షేత్రంలో ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. రైసెన్‌లో పురావస్తుశాఖ పర్యవేక్షకులు కేకే మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని రకాల బౌద్ధస్ధూపాలను ఒక చోట చేర్చి ఇక్కడికి వచ్చే వీక్షకుల కోసం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

కొండ ప్రాంతంలో సుమారు 132 ఎకరాల్లో అటూ ఇటూ విస్తరించి ఉన్న సాంచి స్థూపాలు ఈ ఏడాది జాతీయ పర్యాటక అవార్డుకు ఎంపికయినట్లు తెలిపారు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 27న జరిగిన సైన్సు కేంద్రంలో ఈ అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నామన్నారు.

క్రీ.పూ 300 సంవత్సరంలో ఏర్పడిన ఈ బౌద్ధస్ధూపాలను అనేక మంది విదేశీ, స్వదేశీ పర్యాటకులు ఇప్పటికే సందర్శించారని... మహమ్మద్ తెలిపారు. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటికే లక్షమంది స్వదేశీ పర్యాటకులు, 23వేల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu