Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకటేశ్వర రెడ్డి అపూర్వ ప్రయోగం- విజయలక్ష్మి వెంకట పరమేశ్వరాలయం

వెంకటేశ్వర రెడ్డి అపూర్వ ప్రయోగం- విజయలక్ష్మి వెంకట పరమేశ్వరాలయం
ఈ కాలంలో ఇసుక, సిమెంట్ లేకుండా ఏ నిర్మాణం జరగదు. కానీ భగవదానుగ్రహం ఉంటే, అన్ని సాధ్యమే. అదీ దేవాలయం అయితే వజ్ర సంకల్పం ఉంటే.. నిర్మాణం దానంతట అదే పూర్తవుతుందని నిరూపించారు... లకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పరమేశ్వరి దంపతులు.

కృష్ణాజిల్లా, మైలవరం మండలం, వెల్వడంలో వీరు పూర్తిగా శిలలతో శ్రీ విజయలక్ష్మీ వెంకట పరమేశ్వర ఆలయాన్ని దిగ్విజయంగా నిర్మించారు. ఇందులో శ్రీ భ్రమరాంబాదేవి సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్లను ప్రతిష్టిస్తున్నారు.

మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో బుద్ధిరాజు వంశీయులు ఓ శివాలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ ఆలయం జీర్ణావస్థలోకి చేరగా, శ్రీ లకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పరమేశ్వరి దంపతులు శివాలయాన్ని తీర్చిదిద్ది పూర్వవైభవాన్ని తేవాలని తపించారు. తమ సంకల్పం, భక్తి, ధనాన్ని ధారపోసి ఈ అద్భుత ఆలయాన్ని రూపొందించారు.

ఇసుక, సిమెంట్, ఐరన్ లేని నిర్మాణం
ఇలాంటి ఆలయాలను వందల ఏళ్ళ క్రితం నిర్మించారని మన చరిత్రకారులు వివరించేవారు. వెల్వడం గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి దంపతులు నిర్మించిన ఈ ఆలయానికి మూడున్నర కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యింది. ఆలయం అంతా శిలలతోనే నిర్మించారు. ఎక్కడా ఇసుక, సిమెంట్, ఇనుము వాడలేదు.

నల్లరాయి, గ్రానైట్లతో సర్వాంగ సుందరంగా భ్రమరాంబ, దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి స్పటికలింగాన్ని బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని శివభక్తులకు దివ్యానుభూతి కలిగించే రీతిలో నిర్మించారు. ఆలయం ముందు మనకు రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. అందులో ప్రధాన స్తంభాన్ని అంతా ఏకశిలపై చెక్కగా, మరొకటి శాస్త్రోక్తంగా కలపతో నిర్మాణమైంది.
WD


ఈ ఆలయ బింబ, ధ్వజస్తంభ, దీపస్తంభ, శిఖర, ప్రతిష్టా మహోత్సవాన్ని ఈ నెల 24న తితిదే వేద పండితులు మల్లాది సత్యనారాయణ శాస్త్రి, శైవాగమ పండితులు గణేష్ గురుకుల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

శ్రీ లకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పరమేశ్వరి దంపతులు భ్రమరాంబదేవి, దుర్గామల్లేశ్వర స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాన్ని చేస్తారు.

ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు పూజలు, యాగాలు, అన్నదానాలు నిర్వహించనున్నారు.

శ్రీ లకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఆలయ శాశ్వత ధర్మకర్త.

Share this Story:

Follow Webdunia telugu