Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురాణ ప్రసిద్ధం... శ్రీముఖ లింగం క్షేత్రం

పురాణ ప్రసిద్ధం... శ్రీముఖ లింగం క్షేత్రం
, బుధవారం, 19 నవంబరు 2008 (01:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీముఖ లింగం క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయానికి భక్తులు పోటెత్తక పోయినా పురాణ ప్రసిద్ధమైన ఎన్నో దేవాలయాలు శ్రీముఖ లింగం క్షేత్రంలో ఉండడంతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

శ్రీకాకుళం జిల్లాలోని జిల్లా కేంద్రం నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీముఖ లింగ క్షేత్రం ఉంది. చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వరస్వామి అవతారంలో శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అంతేకాక భీమేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలు కూడా ఈ శ్రీముఖ లింగం క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తాయి. చక్కని శిల్పసంపదతో చూపరులను ఇట్టే ఆకట్టుకునే ఈ శ్రీముఖలింగం క్షేత్రానికి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యం ఉంది.

క్షేత్ర పురాణం
శ్రీముఖ లింగం క్షేత్రంలోని ఆలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడి లింగం రాతితో చెక్కింది కాకుండా ఇప్పచెట్టు మొద్దుతో ఏర్పడింది కావడం విశేషం. ఇప్పచెట్టు మొదలును నరికివేయగా మిగిలిన కాండం ఈ క్షేత్రంలో ముఖలింగంగా ఏర్పడి కాలక్రమేనా ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది.

ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అని పిలిస్తారు కాబట్టి ఇక్కడి గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం అనే పేరు శాశ్వతమైంది. ముఖ లింగం ఆలయంలో గర్భాలయం మాత్రమేకాకుండా ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలున్నాయి. ఈ క్షేత్రంలో స్వామివారితో ఉన్న అమ్మవారిని వరాహిదేవిగా పూజిస్తారు. సప్త మాతృకల్లో ఒకరుగా వరాహిదేవి అమ్మవారిని భక్తులు సేవిస్తారు.

ఈ క్షేత్రంలో ఉన్న భీమేస్వరాలయం శిధిలావస్థలో ఉండగా సోమేశ్వరాలయం కేవలం గర్భగుడిని మాత్రమే కల్గి ఉంది. ఈ ఆలయానికి ముఖ మండపం లేదు.

ఆలయ చరిత్ర
శ్రీ ముఖలింగం ఆలయం నిర్మాణం క్రీ.శ. 10లో జరిగినట్టు ఇక్కడి ఆధారాలు పేర్కొంటున్నాయి. రెండవ కామార్ణవుడన్న రాజు శ్రీముఖం ఆలయాన్ని కట్టించగా అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని నిర్మించాడని శాసనాలు పేర్కొంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu