Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంచారామక్షే,త్రం... క్షీరారామం

పంచారామక్షే,త్రం... క్షీరారామం
, మంగళవారం, 14 అక్టోబరు 2008 (20:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు శైవ క్షేత్రాలు పంచారామాల పేరుతో ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. పంచారామాల్లో కొలువై ఉన్న శివుని దర్శిస్తే సకల పాపాలు తొలిగి జన్మ సార్థకం ఏర్పడుతుందనేది భక్తుల విశ్వాసం.

పంచారామాల చరిత్ర
శివుని కుమారుడైన సుబ్రమణ్యస్వామికి తారకాసురుడనే రాక్షసునికి మధ్య ఆ కాలంలో భీకరయుద్ధం జరిగింది. ఈ యుద్ధం సందర్భంగా సుబ్రమణ్య స్వామి ఆ రాక్షసుని సంహరించాడు. సుబ్రమణ్య స్వామి చేతిలో మరణించిన తారకాసురుడి గొంతులో ఎప్పుడూ ఓ శివలింగం ఉండేదట.

సుబ్రమణ్యస్వామి చేతిలో తారకాసురుడు సంహరించిన సమయంలో అతని కంఠంలోని శివలింగం బయటపడి పగిలి ఐదు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందట. అలా ఆనాడు వివిధ ప్రదేశాల్లో పడ్డ ఐదు శివలింగం ముక్కలే పంచారామాలై విలసిల్లుతున్నాయని పురాణాలు చెబుతున్నాయి.

క్షీరారామం విశేషాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరారామంగా విలసిల్లుతోంది. శ్రీరాముడు సీతమ్మవారితో కలిసి ప్రతిష్టించిన ప్రసిద్ధ శివలింగమే పాలకొల్లులో ఉందన్నది పురాణ గాధ. పాలకొల్లులో కొలువైన క్షీరరామ లింగేశ్వరస్వామి ఆలయాన్ని పూర్వం చాళక్యుల కాలంలో నిర్మించారు.


దాదాపు 125 అడుగుల ఎత్తుతో తొమ్మిది అంతస్థులుగా నిర్మించబడ్డ ఇక్కడి గాలిగోపురం ప్రధాన ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పుణ్యక్షేత్రాల్లో ఉన్న ప్రధాన గాలి గోపురాల్లోకెల్లా ఇది ఎత్తైనదిగా పేర్కొంటారు. క్షీరారామాలయానికి సమీపంలో రామగుండం అనే చెరవు ఉంది. ఈ చెరువుకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది.

పాలకొల్లులోని గాలిగోపురాన్ని నిర్మించే సమయంలో ఒక్కో అంతస్థు పూర్తయిన సమయంలో ఆ ఎత్తువరకు నడిచి వెళ్లేందుకు వీలుగా చుట్టూ మట్టిని పోసేవారట. ఇలా పోయడానికి అవసరమైన మట్టిని రామగుండం ప్రాతం నుంచి తరలించేవారట. అలా పాలకొల్లులోని దేవాలయం పూర్తయ్యేసరికి రామగుండం చెరువు ఏర్పాటు అయ్యిందన్నది కథనం. పాలకొల్లులో వెలసిన ఈ క్షేత్రం లోపలిభాగం విశాలంగా ఉండడంతో పాటు అద్భుతమైన శిల్పకళతో అలరాడుతుంటుంది.

పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయంతో పాటు ఇతరదేవాలయాలు కూడా ఉన్నాయి. పంచారామంగా విలసిల్లుతోన్న పాలకొల్లు ప్రాంతం అటు వినోదాత్మక కేంద్రంగా కూడా విలసిల్లడం విశేషం. ప్రముఖ సినీనటులెందరో ఈ ప్రాంతానికి చెందినవారు కావడం అందరికీ తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu