Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరువనంతపురంలో రూ. 30 కోట్ల తామర చిహ్నం

తిరువనంతపురంలో రూ. 30 కోట్ల తామర చిహ్నం
WD
ప్రపంచ శాంతికి, సోదరభావానికి గుర్తుగా ఓ స్మారక చిహ్నాన్ని తిరువనంతపురంలో ఆవిష్కరించనున్నారు. వికసిస్తున్న తామర ఆకారంలో ఉన్న ఈ స్మారక చిహ్నాన్ని రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఆగస్టు 12న ప్రారంభించనున్నారు. ఈ స్మారక చిహ్నాన్ని ప్రాచీన కాలపు మక్‌రానా మార్బుల్‌తో తయారు చేశారు. ఈ పర్ణశాలను కేరళ రాజధాని తిరువనంతపురానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతిగిరి ఆశ్రమం, పొతాన్‌కోడ్‌లో నిర్మించారు.

కులమతాలు, పేద ధనిక భేదాలు లేకుండా అందరిని ఆదరించే ఉద్ధేశ్యంతో ఈ ఆశ్రమాన్ని 1960లో ప్రారంభించారు. అన్నదానం, అథురసేవనం, ఆత్మభూభబ్నం అనేవి ఈ ఆశ్రమ ముఖ్య లక్ష్యాలు. "మాట సత్యం, సత్యం గరువు, గురువు దేవుడు" అని ఆశ్రమ నిర్వాహక సెక్రటరీ, జ్ఞాన తపస్వి స్వామి గురురత్నం అన్నారు. ఈ సిద్ధాంతాన్ని ఇక్కడి భక్తులందరూ విశ్వసిస్తారని ఆయన అన్నారు.

ఈ తామర ఆకారంలో ఉన్న స్మారక చిహ్న నిర్మాణ పనులను దాదాపు 10ఏళ్ల క్రితమే పర్ణశాలలో చేపట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణ దశ పూర్తి కావస్తుంది. ఈ నిర్మాణానికి సంతిగిరి ఆశ్రమ వ్యవస్థాపకుడు నవజ్యోతిసీ కరుణాకర గురు ఆజ్యం పోశారు. ఈయన మే 1999లో పరమపదించారు. ఈ స్మారక చిహ్నాన్ని పర్ణశాలగా వినియోగిస్తారు. అంతే కాకుండా ఇది ఆధ్యాత్మిక నిలయం గానూ, ఒక చారిత్రాత్మక స్థూపంగానూ నిలువనుంది.

ఈ పర్ణశాల నిర్మాణం 91 అడుగుల ఎత్తును, 84 అడుగుల వెలుపలి వ్యాసాన్ని, అలాగే 61 అడుగుల లోపలి వ్యాసాన్ని కలిగి ఉండి 21 తామర రేకులను కలిగి ఉంటుంది. ఇందలో 12 తామర రేకులు పైకి విచ్చుకొని ఉండగా, 9 తామర రేకులు కింది భాగంవైపు ఉంటాయి. పైకి విచ్చుకొని ఉన్న 12 తామర రేకులు ఒక్కొక్కటి 41 అడుగుల ఎత్తును, క్రింది వైపుకు ఉన్న 9 తామర రేకులు 31 అడుగులు ఎత్తును కలిగి ఉంటాయి. ఈ నిర్మాణానికి రాజస్థాన్ నుంచి తెప్పించిన వైట్ మార్బుల్, కర్నాటక మైన్స్ నుంచి తెప్పించిన బ్లాక్ గ్రనైట్‌లను ఉపయోగించారు.

దాదాపు లక్ష చదరపు అడుగుల మార్బుల్‌ను రాజస్థాన్‌లాని మక్‌రానా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ మొత్తం సముదాయం 21 స్థంబాల మీద ఆధారపడి నిర్మించారు. ఈ బాలాలయం (ఎలివేటెడ్ ఫ్లాట్‌ఫార్మ్) ప్రత్యేకించి వేడుకల కోసం అందమైన కాళాఖండాలతో నిర్మించారు. ఈ పర్ణశాలలోని మొదటి అంతస్థులో 12 గదులు ఉంటాయి. ఇందులో ఆశ్రమ గురువుకు చెందిన వస్తువులను భద్రపరుస్తారు.

ఈ పర్ణశాలలోని మధ్య భాగం(సరకూదమ్)లో 27 అడుగుల తామర పువ్వు ఆకారంలో చెక్కతో చేయబడి ఉంటుంది. దీని మధ్యభాగంలో మార్బల్‌తో చేయబడిన ఓ పెట్టెలాంటి ఆకారం ఉండి, దానిపై నుండి 11 మెట్లను కలిగి ఉంటుంది. ఈ స్థానంలో బంగారంతో చేసిన నిలువెత్తు గరువు విగ్రహాన్ని స్థాపించబడి ఉంటుంది.

ఈ పర్ణశాల వెలుపలి వైపు రంగురంగుల ఫ్లడ్‌లైట్లను కలిగి ఉండి రాత్రి సమయంలో వీక్షించిన వారికి వీనుల విందు కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 30 కోట్లు. గ్రంధాలయం, లెక్చర్ హాల్ మరికొన్ని మౌలిక నిర్మాణాలకు మరో రూ. 20 కోట్లు అవుతందని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu