Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Advertiesment
Mukesh Ambani

ఐవీఆర్

, సోమవారం, 10 నవంబరు 2025 (11:49 IST)
శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య ఆశీస్సులతో, భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను(కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నాము అని శ్రీ ముకేష్ అంబానీ తెలిపారు.
 
ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు(TTD) భాగస్వామ్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారంతో చేపడుతున్నాము. ఈ కొత్త వంటశాల అధునాతన ఆటోమేషన్‌ను కలిగి ఉంటుంది. ప్రతిరోజూ 2,00,000 (రెండు లక్షల) కంటే ఎక్కువ పవిత్ర భోజనాలను తయారుచేసి, అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా, ప్రతి భక్తుడికి అత్యంత భక్తి, పరిశుభ్రత, శ్రద్ధతో తయారుచేసిన పౌష్టికాహార అన్నప్రసాదం ప్రేమతో అందించబడుతుంది.
 
తిరుమల విశ్వాసం, కరుణ మరియు నిస్వార్థ సేవకు శాశ్వత చిహ్నంగా నిలుస్తోంది. ఈ ప్రయత్నం ద్వారా, TTD దేవాలయాలన్నింటికీ అన్నసేవ సంప్రదాయాన్ని విస్తరించాలనే శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారి ఉన్నత ఆశయానికి సహకరించడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. TTD మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి మార్గదర్శకత్వం మరియు సహకారానికి మా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సేవ చేయడం, ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదు అనే తిరుమల దివ్య సంకల్పంలో ఒక చిన్న భాగం కావడం మాకు లభించిన భాగ్యం.
 
శ్రీ అంబానీ గారు కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆ దేవాలయానికి ₹ 15 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్