Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల జారీ.. కళ్యాణోత్సవ టిక్కెట్ ధర రూ.వెయ్యి

నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల జారీ.. కళ్యాణోత్సవ టిక్కెట్ ధర రూ.వెయ్యి
, బుధవారం, 11 నవంబరు 2015 (10:22 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే బుధవారం జారీ చేయనుంది. గురువారం స్వామివారికి జరిగే సేవలకు సంబంధించి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. సుప్రభాతం టిక్కెట్లు 100, తిరుప్పావడసేవా టిక్కెట్లు 25, కల్యాణోత్సవం 100 వంతున ఖాళీగా ఉన్నాయి. టిక్కెట్లు కొరుకునే భక్తులు తిరుమల కేంద్రీయ విచారణ కార్యాలయ(సీఆర్వో) ఆవరణం ఆర్జితం కౌంటరులో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ అవకాశం బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తితిదే కల్పిస్తుంది. అనంతరం అందుబాటులో ఉన్న టిక్కెట్లను బట్టి భక్తులను ఎక్టానిక్‌ లాటరీ విధానం కింద ఎంపిక చేస్తుంది. సుప్రభాతం టిక్కెట్టు ధర రూ.120, తిరుప్పావడ సేవా టిక్కెట్లు రూ.850, కల్యాణోత్సవం రూ.1,000గా ధరను తితిదే నిర్ణయించింది.
 
ఇదిలావుండగా, బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం రేవాను తుఫాను తిరుమల వెంకన్న భక్తులకు వరమేనని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) సాంబశివరావు పేర్కొన్నారు. నిజానికి రేవాను తుఫాను కారణంగా రోజుల తరబడి తిరుమలలో వర్షం కురుస్తోంది. భక్తులు నానా పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్ రోడ్లు దాదాపుగా మూతపడ్డాయి. అయితే వెనువెంటనే రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతూ భక్తుల ఇబ్బందులను తొలగిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవాను తుఫాను వెంకన్న భక్తుకు వరమెలా అవుతుందనేగా మీ అనుమానం?
 
తిరుమల పరిధిలోని జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టంతో కనిపించి చాలా కాలం అవుతోంది. దీంతో కొండపై ఎప్పటికప్పుడు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే రేవాను తుఫాను పుణ్యమా అని ప్రస్తుతం తిరుమల కొండ పరిధిలోని అన్ని జలాశయాలకు జలకళ వచ్చేసింది. అన్ని జలాశయాలు వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. దీంతో మరో ఏడాది పాటు చుక్క వర్షం కురవకున్నా, తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన సెలవిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu