సుప్రసిద్ధ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు ప్రస్తుతం మన సమాజంలోని వికృత పోకడలను తూర్పారపడుతుంటారు. ఆయన చెప్పదలుచుకున్నది ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా చెప్పేస్తుంటారు. అందులో ఎలాంటి మొహమాటం వుండదు. ఆయన మహిళలు సందర్భానుసారంగా కాకుండా వేసుకునే దుస్తుల గురించి చురకలు అంటించారు.
నైటీ గురించి మాట్లాడుతూ... దాని పేరే నైటీ. అది రాత్రి వేసుకునే వస్త్రం. అందుకే దానికి నైటీ అని పేరు పెట్టారు. రోజంతా పగలు కూడా వేసుకుని తిరగడానికి అది డేటీ కాదు కదమ్మా. నైటీ అన్నందుకు దానికి కాస్తయినా గౌరవం ఇవ్వాలి. ఆడవాళ్లు ఇంట్లో వున్నాసరే చీరకట్టుకుని వుండాలి. అందమంతా ఆ చీరలోనే వుంటుంది. పొద్దస్తమానం పైనుంచి కిందకు దిగేసే ఆ నైటీ ఎందుకుమ్మా అంటూ చురకలు అంటించారు.