Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు
, సోమవారం, 11 ఏప్రియల్ 2016 (11:42 IST)
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు 'బ్రహ్మోత్సవాలు'  జరగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా, తొలి రోజు అంకుర్పాణ కార్యక్రమం ఉంటుందన్నారు. 12న గరుడాధివాసం, 13న దేవతాహ్వానం, 14న ఎదుర్కోలు, 15న సీతారాముల కల్యాణోత్సవం, 16న మహా పట్టాభిషేకం జరుగుతుంది. 17న సదస్యం, 18న చోరోత్సవం, 19న ఊంజల్‌ ఉత్సవం, 20న వసంతోత్సవం, 21న చక్రతీర్థం నిర్వహిస్తారు. 
 
కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 16న గవర్నర్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. రూ.5 వేల విలువైన ఉభయ దాతల సెక్టార్‌ టిక్కెట్లను ఇప్పటికే విక్రయిస్తుండగా రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువైన టిక్కెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. 60 క్వింటాళ్ల తలంబ్రాలు, క్వింటా ముత్యాలతో ఈ సారి ముత్యాల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu