Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో ఘనంగా ఆళ్వార్ తిరుమంజనం

తిరుమలలో ఘనంగా ఆళ్వార్ తిరుమంజనం
FILE
ఏడుకొండలపై వెలసిన కలియుగ వైకుంఠ దైవం తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.

మంగళవారం ఉదయం పసుపు, చందనం. కుంకుమ, తిరునామం, పచ్చకర్పూరం వంటి సుగంధద్రవ్యాలతో తయారుచేసిన ప్రత్యేక లేపనంతో గర్భాలయ సన్నిధిలోని గోడలు, ఆలయంలోని వకుళమాలిక, యోగ నరసింహ స్వామి, వరదరాజస్వామి, భాష్యకారుల మందిరాలను శుభ్రపరిచారు. అలాగే ప్రసాదాసు తయారు చేసే పోటును కూడా శుద్ధి చేశారు.

ఈ నెస 21 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తితిదే వెల్లడిచింది. ఏడాదికి నాలుగుసార్లు ఈ శుద్ధి కార్యక్రమాన్ని జరపడం ఆనవాయితీ.

ఇకపోతే.. తిరుమంజనం సందర్భంగా మధ్యాహ్నం వరకు సర్వదర్శనాన్ని నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను కూడా తితిదే రద్దు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu