సత్యం... శివం... సుందరం... సత్య సాయిబాబా

ఒక శివలింగం.. ఆయన చేతిలోంచి ప్రత్యేకంగా పుట్టుకొస్తూంటుంది.
ప్రతిరోజు ఆయన విభూతిని గాల్లోంచి సృష్టిస్తుంటారు
అవును... అయనే ప్రశాంతి నిలయం భగవాన్ సత్య సాయిబాబా...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం పుట్టపర్తి. భగవాన్ సత్యసాయిబాబా మహిమ కారణంగా ఈ చిన్ని గ్రామం ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ కీర్తిని ఆర్జించింది. సాయిబాబా పట్ల మొక్కవోని భక్తిప్రపత్తులు గల భక్తులు ఇక్కడ సాయిబాబా ఆశ్రమాన్ని నిర్మించారు. దీనికే ప్రశాంతి నిలయం అని పేరు. అంటే శాంతికి నిలయం అని అర్థం

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన తీర్థయాత్రా స్థలాల్లో పుట్టపర్తి ఒకటి. మహనీయుడైన సాయిబాబాను దర్శించి ఆయన ఆశీస్సులు అందుకోవాలనే తలంపుతో ప్రపంచం నలుమూలలనుంచి ఈ చిన్న గ్రామానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఒకానొకప్పుడు ఊరూ పేరూ లేనట్లుగా ఉన్న చిన్ని గ్రామమైన పుట్టపర్తి ఈ రోజు విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది.

ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు సాయిబాబా ఆశీస్సులు పొందేందుకోసం ప్రశాంతి నిలయానికి వస్తుంటారు. ప్రశాంతి నిలయంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది
WDWD
సాయిబాబా మహిమలు కొనియాడుతూ భజన చేసిన తర్వాత సాయిబాబా ఆధ్యాత్మిక ప్రసంగం మొదలవుతుంది. జీవితానికి సంబంధించిన మూల సూత్రాల ఆధారంగా ఆయన బోధనలు కొనసాగుతాయి.

అవి సత్యం, సత్ప్రవర్తన, శాంతి, విశ్వజనీన ప్రేమ, అహింస అనే మూలసూత్రాలనే ఆయన నిత్యం ప్రవచిస్తుంటారు. ఆశ్రమంలో విద్యాసంస్థలు, మ్యూజియం. నక్షత్రశాల తదితర దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 23న ప్రశాంతి నిలయం అద్భుతంగా అలంకరించబడుతూ ఉంటుంది. ఆరోజు సాయిబాబా జన్మదినం మరి.

భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి వంటి ప్రముఖులు పుట్టపర్తి ఆశ్రమంలో అధికారికంగా అతిథులుగా వస్తుంటారు. సాయిబాబా 80వ జన్మదినం సందర్భంగా ప్రశాంతి నిలయానికి పది లక్షల మంది భక్తులు విచ్చేశారని అంచనా. భారత్ నుంచి, ప్రపంచంలోని 180 దేశాలనుంచి 13 వేలమంది ప్రతినిధులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారట.

WDWD
సత్యం శివం సుందర
సత్య సాయిబాబా చాలావరకు ప్రశాంతి నిలయంలోని తన ప్రధాన ఆశ్రమంలో ఉంటారు. దేశంలో ఆయనకు మూడు ప్రధాన మందిరాలు ఉన్నాయి. ముంబైలోని తొలి కేంద్రాన్ని ధర్మక్షేత్ర లేదా సత్యం అని పిలుస్తుంటారు. హైదరాబాద్‌లో ఉన్న రెండో కేంద్రం శివం అని చెప్పబడుతుంది. చెన్నయ్‌లో ఉన్న మూడవ కేంద్రం సుందరంగా పిలవబడుతోంది. సుందరం కేంద్రం భజన బృందాలకు ప్రసిద్ధి గాంచింది. వీరు ఇంతవరకు 54 క్యాసెట్లు, సిడిలలో పాటలను విడుదల చేశారు. 54వ క్యాసెట్‌లో సాక్షాత్తూ సాయిబాబాయే పాటలు పాడటం గమనార్హం. సాయిబాబా పలు ఉచిత విద్యా సంస్థలను, ధర్మసంస్థలను, సేవా ప్రాజెక్టులను నెలకొల్పారు. ప్రపంచమంతటా 166 దేశాల్లోని 10వేల కేంద్రాలలో ఇవి వ్యాపించి ఉన్నాయి.

సాయి నిత్య కార్యకమ
సాయి బాబా ఆశ్రమంలో ఉదయం పూట ఓంకార మంత్రాన్ని జపిస్తూ, సుప్రభాతం పఠించడం ద్వారా రోజువారీ కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత వేదపారాయణం, నగర సంకీర్తన - ప్రాభాత భక్తిగీతాలు మొదలవుతాయి. రోజూ రెండు సార్లు భజన కార్యక్రమాల తర్వాత సాయిబాబా తన భక్తులకు దర్శనమిస్తారు.

దర్శన సమయంలో సాయిబాబా తన శిష్యులు, అనుచరుల మధ్య తిరుగాడుతుంటారు. చాలా సార్లు ఆయన భక్తులతో సంభాషిస్తుంటారు. విన్నపాలు తీసుకుంటారు. విభూతిని సృష్టించి పంచుతుంటారు. లేదా వ్యక్తులను, బృందాలను ఇంటర్వ్యూలకు పిలుస్తుంటారు. ఇంటర్వ్యూలు పూర్తిగా బాబా అభీష్టం మేరకే ఎంపిక చేయబడతాయి.

బాబా ఇంటర్వ్యూ పొందగలగడం మహా భాగ్యమమని భక్తులు నమ్ముతుంటారు. ఒక్కోసారి ఒకే వ్యక్తి, గ్రూపు లేదా కుటుంబం ప్రయివేటు ఇంటర్వ్యూలకు ఆహ్వానితులవుతుంటారు. అలాంటి ఇంటర్వ్యూలను పొందగలిగే వారు సాయిబాబా తమ జీవితాల గురించే ప్రస్తావించడం చూసి ఆశ్చర్యపోతుంటారు.

తన దర్శనమాత్రంతో పలు ఆధ్యాత్మక ప్రయోజనాలు కలుగుతాయని సాయిబాబా చెబుతుంటారు. సాధారణంగా హిందువులు సన్యాసులు, గురువులు గురించి
WDWD
ఇదేవిధమైన విశ్వాసాలను కలిగి ఉంటారు.

బాబా ఉనికి, దివ్యత్వం గురించి ప్రజలు ప్రశ్నలు అడిగినప్పుడల్లా భగవాన్ ఇలానే చెబుతూ ఉంటారు..."నేనే దేవుణ్ణి. మరియు మీరు కూడా దేవుళ్లే... మీకూ నాకు తేడా ఎక్కడ ఉందంటే నాకు ఈ విషయం తెలుసు, మీరు పూర్తిగా ఈ విషయం తెలుసుకోలేరు...". అందుకే పుట్టపర్తిలోని భగవాన్ సాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించకుండా దక్షిణ భారత యాత్ర పూర్తియిట్లు కాదు మరి.

అనేక ఆసక్తికరమైన స్థలాలు పుట్టపర్తిలో ఉన్నాయి. ఉదాహరణకు సత్యభామ ఆలయం, శివాలయం. బాబా ఇక్కడే పుట్టారు. చిత్రావతి నది, కల్పవృక్ష లేదా కోరిన కోరికలు తీర్చే చింతచెట్టు -దీనినుంచే బాబా మధురఫలాలను సృష్టిస్తుంటారు- సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటి పలు సందర్శనీయ స్థలాలు పుట్టపర్తిలో ఉన్నాయి.

ఎలా చేరాలి?
అనంతపురం జిల్లానుంచి 80 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే పుట్టపుర్తి చేరుకోవచ్చు.
అనంతపురం జిల్లా రైల్వే స్టేషన్ నుంచి 80కిలోమీటర్ల మేర దూరంలో పుట్టపుర్తి ఉంటుంది.
హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి పుట్టపర్తికి చెరుకోవచ్చు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు 120 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి నెలకొని ఉంది.