Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సప్తశృంగి దేవి అర్థ శక్తిపీఠం

సప్తశృంగి దేవి అర్థ శక్తిపీఠం
మహారాష్ట్రలో నెలకొన్న మూడు సుప్రసిద్ధ శక్తిపీఠాలలో అర్థపీఠమైన సప్తశృంగి దేవీ పీఠం ఒకటి. ఇది నాసిక్‌కు 65 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఈ పీఠం సహ్యాద్రి పర్వత శ్రేణికి చెందిన ఒక కొండపై ఉంది. ఇది సముద్ర మట్టానికి 4,800 అడుగుల ఎత్తున ఉంది. దీనికి ఒకవైపున లోతైన లోయ ఉండగా మరోవైపున చుట్టూ పచ్చగా ఉండే ఎత్తైన పర్వతాలు ఉంటున్నాయి. ఇక్కడ నిలబడి చూస్తే దేవీ మాత మిమ్మలను అందమైన ప్రకృతిలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.

ఈ శక్తిపీఠం వెనుక పురాణ గాధ ఉంది. మహిషాసురుడి ఆగడాలనుంచి విముక్తి పొందడానికి సకలదేవతలూ దేవీమాతను ప్రార్థించారట. అప్పుడు దేవీ మాత సప్తశృంగిదేవి రూపంలో ప్రత్యక్షమైంది. ప్రాచీన కావ్యాలు పేర్కొన్నదాన్ని బట్టి ప్రపంచం మొత్తంలో 108 శక్తిపీఠాలు ఉండగా వాటిలో మూడున్నర శాతం పీఠాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయట. సప్తశృంగి పీఠాన్ని అర్థ శక్తిపీఠంగా భావిస్తున్నారు. ఇక్కడ తప్ప ప్రాచీన హిందూ తాళపత్రాల్లో ఏ ఇతర ప్రాంతంలోనూ అర్థ శక్తిపీఠం ఉన్నట్లు పేర్కొన్న దాఖలాలు లేవు. ఈ పీఠంలోని దేవిని బ్రహ్మస్వరూపిణిగా కూడా పిలుస్తుంటారు.

బ్రహ్మదేవుడి కమండలంనుంచి ఆవిర్భవించిన గిరిజామహానంది దేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటోందని జనం నానుడి. సప్తశృంగి దేవిని మహాకాలుడు, మహాలక్ష్మి, మహాసరస్వతిల సంయుక్త రూపిణిగా భావించి జనం పూజిస్తుంటారు. నాసిక్ లోని తపోవనానికి సీతారామలక్ష్మణులు విచ్చేసినప్పుడు ఈ పీఠాన్ని సందర్శించారని
WDWD
చెబుతుంటారు.

ఇక్కడి చాటువుల చెప్పే దాన్ని బట్టి, ఒకానొకప్పుడు తేనె గూడును ఛేదించాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా చూశాడట. సప్తశృంగి దేవీ పీఠం 8 అడుగులు ఎత్తు ఉంటుంది. మహిషాసురుడి మర్దనకోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడి దేవికి ఉన్న 18 హస్తాలలో అలలారుతుంటాయి.

శివుడి త్రిశూలం, విష్ణు చక్రాయుధం, వరుణుడి శంఖువు, అగ్ని జ్వాలాయుధం, వాయువు విల్లుబాణాలు, ఇంద్రుడి వజ్రాయుధం, యమదండం, దక్షప్రజాపతి స్పటిక మల్ల, బ్రహ్మ కమండలం, సూర్య కిరణాలు, కళాస్వరూపి కత్తి, క్షీరసాగరుడి హారం, కుండలం, కంకణం, విశ్వామిత్రుడి పరశు మరియు ఆయుధం ఇక్కడి దేవి చేతుల్లో అలలారుతుంటాయి.

webdunia
WDWD
ఆలయానికి వెళ్లే దారిలో 472 మెట్లు ఉంటాయి. చైత్ర, అశ్విని నవరాత్రులలో ఇక్కడ ఉత్సవం జరుగుతుంటుంది. చైత్రమాసంలో దేవి దరహాస వదనంతో ఉండగా, నవరాత్రులలో రుద్రరూపంలో ఉంటుందని చెబుతుంటారు. పర్వతంలో 108 చిన్న మడుగులు ఉంటున్నాయి. ఇవి ఈప్రాంత సౌందర్యాన్ని ఇనుమడింప జేస్తుంటాయి.

గమ్య మార్గాలు
ఇక్కడికి సమీపంలో ముంబై లేదా పూణే విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక్కడినుంచి మీరు నాసిక్‌ పట్టణానికి బస్సు లేదా ప్రయివేట్ వాహనంలో వెళ్లవచ్చు.

అన్ని ముఖ్య నగరాలతో నాసిక్‌కు రైలు మార్గం ఉంది. కాబట్టి ఇక్కడికి రైలుప్రయాణం చాలా సులువైన మార్గం.

నాసిక్‌కు 65 కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి పర్వత శ్రేణి ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు మహారాష్ట్ర రోడ్డు రవాణా బస్సును లేదా ప్రయివేటు వాహనాన్ని ఉపయోగించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu