Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం సేవిస్తున్న కాలభైరవుని విగ్రహం

మద్యం సేవిస్తున్న కాలభైరవుని విగ్రహం

Shruti Agarwal

Shruti AgarwalWD
విగ్రహమేదైనా మద్యం తాగడాన్ని గతంలో మీరు చూశారా? ఖచ్చితంగా లేదనే చెపుతారు మీరు. విగ్రహం మద్యాన్ని ఎలా తాగుతుంది?

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
విగ్రహం నిర్జీవమైనది మరియు మా అనుభవాన్ని అనుసరించి నిర్జీవాలకు ఆకలి, దాహం తదితర భావనలు కలిగే అవకాశం లేనే లేదు... అయితే ఈ విషయంలో ఉజ్జయినికి చెందిన కాలభైరవ విగ్రహానికి మినహాయింపు ఇవ్వక తప్పదు. భక్తుడు నివేదించిన మద్యాన్ని కాలభైరవుని విగ్రహం తాగడం మేము ప్రత్యక్షంగా చూసాము.
webdunia
Shruti AgarwalWD

‘ఏది నిజం'కు కొనసాగింపుగా ఈ రహస్యం వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీయాలని మేము ప్రయత్నించాము. నిజ నిర్థారణకు గాను మేము ఉజ్జయిని నగరానికి పయనమయ్యాము. ఉజ్జయిని... మహాశివుని ద్వాదశ జ్యోతిర్లంగాలలో ఒకటైన మహాకాళేశ్వరుడు కొలువైన దేవాలయాల నగరం. కానీ మా గమ్యస్థానం మహాకాళేశ్వరుని దేవాలయానికి ఐదు కి.మీ.ల దూరంలో గల కాలభైరవుని ఆలయం. ఆలయ ప్రధాన ద్వారానికి త్వరగానే చేరుకున్నాము.

దేవాలయం వెలుపల గల దుకాణాలలో పూజాద్రవ్యాలు, పుష్పాలతో పాటు మద్యం కూడా ఉండటం మా దృష్టిని ఆకర్షించింది. మా ముందే కొంత మంది భక్తులు మద్యపు సీసాలను దుకాణాల నుంచి కొనుగోలు చేయడం గమనించాము.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

webdunia
Shruti AgarwalWD
మద్యసేవనం వెనుక రహస్యం గురించి దుకాణదారు రవివర్మను వాకబు చేయగా అతను ఇలా చెప్పాడు. " కాలభైరవుని కృపను కోరి వచ్చే ప్రతి భక్తుడు దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. మద్యంతో నిండిన పాత్ర కాలభైరవ దేవుని నోటి వద్ద ఉంచిన మరుక్షణం, పాత్ర నుంచి మద్యం మాయమవ్వడం ప్రారంభమవుతుంది.”
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
దేవాలయ ఆవరణలోకి ప్రవేశించగానే పెద్ద సంఖ్యలో భక్తుల కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న బుట్టలో కొబ్బరికాయ, పుష్పాలతో పాటు మద్యం సీసా కూడా కనిపించింది. భైరవదేవుడు కొలువైన గర్భగుడిలో ఒక మూల నిల్చొని దేవుడు మద్యం ఎలా తాగుతాడో గమనించసాగాం...

గర్భగుడిలోని వాతావరణం వింతగా ఉంది. పూజారి గోపాల్ మహారాజ్ విగ్రహం ఎదుట నిలబడి శ్లోకాలు చదువుతూ మద్యంతో నిండిన పళ్లాన్ని కాలభైరవ విగ్రహం నోటి వద్ద ఉంచారు ... కలయో? వైష్ణవమాయయో...!! పళ్లెంలో ఒక్క చుక్క కూడా మద్యం మిగలలేదు...
webdunia
Shruti AgarwalWD


మద్య నివేదన కార్యక్రమం అలా కొనసాగుతూనే ఉంది……అంతా మా కళ్లముందే జరుగుతోంది. సంభ్రమాశ్చర్యాలలో మేము మునిగిపోయాము.... పూజారి స్వహస్తాలతో అందిస్తుండగా విగ్రహం మద్యం సేవించసాగింది. ఈ విషయాన్ని భక్తులలో ఒకరైన రాజేష్ చతుర్వేదితో మేము చర్చించాము.

తాను ఉజ్జయిని నివాసినని ప్రతి ఆదివారం దేవాలయాన్ని సందర్శిస్తుంటానని రాజేష్ చెప్పారు. మొదట్లో తనకు కూడా మద్యం ఎటుపోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేదని, కానీ తర్వాత స్వీయఅనుభవంతో కాలభైరవ దేవుని విగ్రహమే మద్యాన్ని సేవిస్తోందన్న నమ్మకానికి వచ్చానని రాజేష్ తెలిపారు.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

webdunia
Shruti AgarwalWD
కాలభైరవ దేవాలయం 6000 సంవత్సరాల కాలం నాటిది. ఇది ‘వామ్ మార్గి' తాంత్రిక దేవాలయం. ఇలాంటి దేవాలయాలలో దేవునికి మాంసం, మద్యం, ధనం తదితరాలను నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో, దేవాలయంలోనికి మాంత్రికులను మాత్రమే అనుమతించేవారు. కానీ కాలం తెచ్చిన మార్పులతో దేవాలయ సందర్శన అందరికీ అందుబాటులో వచ్చింది.
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రహస్యం వెనుక ఏది నిజం? రహస్యం గుట్టు విప్పేందుకు ఎన్నో తర్కవితర్కాలు. వాగ్వాదాలు, అనేక పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. కొందరు ఏమంటారంటే ఆంగ్లేయులు పాలిస్తున్న కాలంలో రహస్యాన్ని రట్టు చేయాలని ఒక ఆంగ్లేయ అధికారి ప్రయత్నించి విఫలయుడయ్యాడని తెలిపారు.

మా ప్రయత్నంగా దేవాలయం అంగుళం అంగుళం శోధించాము. కనిపించిన వారందరితో చర్చలు సాగించాము...కానీ చివరకు కాలభైరవ దేవుని విగ్రహం మద్యం సేవిస్తుందన్న వాస్తవాన్ని మేము కూడా విశ్వసించాల్సి వచ్చింది...
webdunia
Shruti AgarwalWD


విశ్వాసానికి పునాది

ఈ పురాతన సాంప్రదాయం ఎలా ప్రారంభమైందీ ఎవరికీ తెలియదు... తాము చిన్ననాటి నుంచి ఈ దేవాలయానికి వస్తున్నట్లు కొందరు భక్తులు మాతో అన్నారు. అప్పటినుంచే విగ్రహానికి మద్యం నివేదించడాన్ని గమనిస్తున్నామని తెలిపారు.

పూర్వకాలంలో, మద్యంతో పాటుగా జంతువులను కూడా బలి ఇచ్చేవారు కానీ ప్రస్తుతం విగ్రహానికి నైవేద్యం కేవలం మద్యానికే పరిమితమైపోయింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో, ప్రభుత్వ అధికారులు కూడా భైరవ దేవునికి మద్యాన్ని సమర్పించుకుంటారు.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu