Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ రాజూ బసచేయలేని నగరం.... తెలుసుకుందాం రండి

ఏ రాజూ బసచేయలేని నగరం.... తెలుసుకుందాం రండి
, సోమవారం, 10 డిశెంబరు 2007 (20:11 IST)
WD
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం... మధ్య భారతదేశంలోని ఒకానొక ప్రముఖ నగరంలో రాత్రిపూట బస చేసేందుకు రాజాధిరాజులు జంకుతుంటారు... ఈ నగరం జ్యోతిర్లంగంతో ప్రసిద్ధి చెందింది.... మీ ఊహ సరైందే.. మనం మాట్లాడుకుంటోంది మహాకాళుని నగరమైన ఉజ్జయినీ గురించి. ఉజ్జయినీ రాజు మహాకాళుడు మాత్రమేనని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఏమరుపాటున వేరే రాజులు ఎవరైనా ఇక్కడ రాత్రి పూట బస చేసినట్లయితే, వారి రాజ్యానికి, అధికారానికి నీళ్ళు వదులుకోవాల్సిందే.

దీని వెనుక రహస్యం ఎవరికి అంతు పట్టకున్నప్పటికీ, ప్రస్తుత కాలంలో ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రి లేదా ప్రధానితో సహా ఉజ్జయినీలో రాత్రి పూట బసచేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. స్వాతంత్రం రావడానికి ముందు గ్వాలియర్ మహారాజులైన సింథియాల రాజ్య పరిధిలో ఉజ్జయిని ఉండేది. రాజకుటుంబీకులు ఎవరైనా ఈ నగరాన్ని సందర్శించినప్పుడు నగరానికి వెలుపల నిర్మితమై కాళీయాడే పేరుతో పిలవబడే రాజప్రాసాదంలో బస చేసేవారు.
webdunia
WD


ఇది సింథియాలకే పరిమితమవలేదు... క్రమంగా ఇదే సంప్రదాయాన్ని మిగిలిన నేతలు కూడా పాటించటం మొదలుపెట్టారు. ఈ సంప్రదాయం రాష్ట్ర కార్యకలాపాలలోనూ ఆవరించింది. దీనితో ప్రభుత్వ కార్యకలాపాలు సాఫిగా జరిగిపోయేందుకుగాను సింధియాలు నగరానికి వెలుపల కాలియాడే ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రభుత్వ అధికారులు ఉదయం వేళ నగరంలో తమ పనిచూసుకుని సాయంత్రానికల్లా కాలియాడే ప్యాలెస్‌కు తిరిగి రావాల్సిందే.

webdunia
WD
కాలియాడే ప్యాలెస్‌లో సమస్త సౌకర్యాలున్నాయి. ప్యాలెస్ ముందు అందమైన నీటి కొలనును నిర్మించారు. తమ ఇష్ట దైవం సూర్య భగవానుని కొలిచేందుకు వీలుగా సింథియాలు ఆ ప్యాలెస్‌కు ప్రక్కనే సూర్యదేవాలయాన్ని నిర్మించారు.

స్వాతంత్ర్యానంతరం సింథియా రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. అయితే ఈ సంప్రదాయం మాత్రం అలానే నిలిచి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వ మంత్రులు నగరంలో బసచేసేందుకు జంకుతుంటారు. ఈ కారణంగా ప్రభుత్వం సైతం నగరానికి వెలుపల అతిథి గృహాలను నిర్మించింది.
webdunia
WD


మంత్రి అయినా లేదా పెద్ద వ్యాపారస్తుడైనా ముందుగా ఉజ్జెయినీ మహాకాళేశ్వరుని దర్శించుకోవాల్సిందేనంటున్నారు మహాకాళేశ్వర ఆలయ పూజారి వివరిస్తున్నారు. అంతేకాదు భగవంతుని దర్శించుకోవటంతోపాటు 'భస్మా హారతి'‌లో పాల్గొని అది పూర్తయిన తరువాత మాత్రమే వారు తమ తదుపరి కార్యక్రమాలలో నిమగ్నమవుతారని పూజారి చెపుతున్నారు.

webdunia
WD
మహాకాళేశ్వరుడు నగరాన్ని వివిధ శక్తుల నుంచి ఎలా కాపాడుతున్నాడన్న వైనాన్ని ఆలయ పూజారి మా వెబ్‌దునియా విలేఖరికి వివరించాడు. మహాకాళేశ్వరుడే ఉజ్జెయినీకి ఏకైక మహారాజు. అంతేకాదు ప్రతిఏడాది శ్రావణ మాసంలో ఆయన నగరాన్ని సందర్శిస్తాడు. ఏ రాజును లేదా మంత్రిని తన పరిధిలో బసచేయటాన్ని ఆయన అంగీకరించడు. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవారు తమ రాచరిక జీవితాన్ని లేదా ఉన్నత పదవులను వదులుకోవలసిందే.

దీనికి ఉదాహరణగా ఉమాభారతి ఉదంతాన్ని చెపుతున్నారు. ఆమె ఉజ్జెయినీలో తన ఆధ్యాత్మిక గురువును కలిసేందుకు గాను బసచేయవలసి వచ్చింది. ఫలితంగా ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసి వచ్చిందని పూజారి వివరిస్తున్నారు.
webdunia
WD


అయితే ఉమాభారతికి ఇలా జరగటం వెనక అనేక కారణాలు ఉన్నప్పటికీ... ఉజ్జెయినీలో బస చేసినందుకే ఇలా జరిగిందని బలమైన విశ్వాసం ఉంది. రాజేశ్ భాటియా అనే భక్తుడు ఇలా చెపుతున్నాడు... మహాకాళేశ్వరునిపై ఉన్న విశ్వాసంతో చాలా మంది రాజులు నగరానికి వెలుపలే బసచేస్తున్నారు. కనుక తన భక్తులైన వారిని మహాకాళేశ్వరుడు ఎలా హాని తలపెడతాడు అని అతను ప్రశ్నిస్తున్నాడు. ఇది విశ్వసించదగ్గ విషయమా లేదా ఒట్టి మూఢనమ్మకమేనా?

Share this Story:

Follow Webdunia telugu