Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారిద్దరు కలిసి ప్రయాణిస్తే పడవ గల్లంతే..

వారిద్దరు కలిసి ప్రయాణిస్తే పడవ గల్లంతే..
WD PhotoWD
మేనమామ... మేన అల్లుడు... ముఖ్యంగా చెల్లెలు కుమారుడు మధ్య ఉన్న సంబంధం అత్యంత ప్రేమానుబంధాలతో కూడుకొని ఉంటుంది. అయితే వీరిద్దరూ కలిసి ప్రత్యేకించి ఒక ప్రాంతంలోని నదిలో ఒకే పడవలో ప్రయాణిస్తే తప్పకుండా మునిగిపోవడం ఖాయం. ఏమిటీ ఇది నిజమా అని ఆశ్చర్యపోతున్నారా...? దీనిపై మీకేమైనా సందేహాలు ఉంటే పక్కన పెట్టండి. కాని ఇది నిజం. దీనికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఈ నిదర్శనాలను మా ఈ వారం 'ఏదినిజం' శీర్షికలో మీ ముందుకు తెస్తున్నాం. చదవి మీ సందేహాన్ని తీర్చుకోండి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరాన నీమావార్ అనే ఓ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి సమీపంలో నర్మదా నదిలో ఒక భాగంలో నీరు సుడులు తిరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద సుడిగుండం. దీనినే 'నాభీ కుండం‌'గా కూడా పిలుస్తారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల
webdunia
WD PhotoWD
నుంచి పర్యాటకులు భారీగానే తరలి వస్తుంటారు.

ఈ దృశ్యాన్ని పడవలో పయనించి దగ్గరగా చూసి ఆనందపడుతుంటారు. అయితే మేనమామ, మేనల్లుడు ఒకే పడవను ఎక్కి చూడాలని నదిలోకి వెళ్లారంటే మాత్రం.. వారు తిరిగిరాని లోకాలకు చేరుకోవాల్సిందే. ఎందుకంటే వారు ఎక్కిన పడవ తప్పకుండా నదిలో మునిగిపోతుందట.

ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుదన్న విషయం మీకు తెల్సిందే. ఈ సమస్యకూ బ్రహ్మాండమైన పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. మేనమామ, మేనల్లుడు కలిసి ప్రయాణించదలుచుకున్నప్పుడు వారు ఓ ప్రత్యేక పూజను ఆచరించి... ఎంచక్కా ఒకే పడవలో కలిసి నదీ విహారం చేయవచ్చు.

webdunia
WD PhotoWD
నదీతీరంలో ధర్మేంద్ర అగర్వాల్ అనే ప్రర్యాటకుడు తన మేనల్లుడు ఆయుష్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ పూజను విజయవంతంగా పూర్తి చేసిన పక్షంలో ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఒకే పడవలో ప్రయాణించవచ్చు.

ఈ ప్రత్యేక పూజ గురించి తాము పూజారి అఖిలేష్‌ను అడిగినప్పుడు అతను ఆసక్తిని కలిగించే ఓ కథను చెప్పుకొచ్చాడు. పూర్వం గోకులం నుంచి మధుర రాజు కాన్ అతని మేనల్లుడు కలిసి ఒకే పడవలో నదిలో ప్రయాణిస్తుండగా, ఆదిశేషు ప్రత్యక్షమై వారి పడవను తలకిందులు చేసిందట. ఆ సంఘటన జరిగిననాటి నుంచి నీమావార్ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేనల్లుడు, మేనమామలు ఒకే పడవలో విహరించడాన్ని అనుమతించడం లేదు.

ఇది భయమా... నిజమా.. లేదా నమ్మకమా... అలాకాదంటే మూఢ విశ్వాసమా అన్న విషయాలను ప్రక్కనపెడితే ఇక్కడి ప్రజలు మాత్రం ఈ సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు... దయచేసి మాకు రాయండి.

Share this Story:

Follow Webdunia telugu