Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంప్రదాయ వస్త్రాలతో దైవ దర్శనం చేసుకుంటే..?

సంప్రదాయ వస్త్రాలతో దైవ దర్శనం చేసుకుంటే..?
, గురువారం, 18 డిశెంబరు 2014 (12:37 IST)
సంప్రదాయ వస్త్రాలతో దైవ దర్శనం చేసుకోవడంలో ప్రయోజనాలేంటో తెలుసా.. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం వలన ఎలా లభిస్తుందో, అలాగే పురుషులు నడుము పై భాగాన వస్త్రం ధరించక దైవ దర్శనం చేసుకోవడం వలన కూడా అలాంటి శక్తే నేరుగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
సంప్రదాయ బద్ధమైన వస్త్రాలతో దైవదర్శనం చేయడం వలన ఎలాంటి ఆకర్షణలకు తావులేకుండా పోవడమే కాకుండా, పైన తెలిపిన ఆరోగ్య రహస్యం కూడా ఈ ఆచారంలో అంతర్లీనంగా కనిపిస్తూ వుంటుంది. దైవ దర్శన సమయంలో స్త్రీలు సంప్రదాయ బద్ధమైన వస్త్రాలను నిండుగా ధరించాలనీ, ఇక పురుషులు మాత్రం ఛాతి భాగం కనిపించేలా పలుచని వస్త్రాలు ధరించాలి. ఈ ఆచారాన్ని చాలా దేవాలయాలు పాటిస్తూ వుండటం గమనించదగిన విషయం. ఈ విధమైన ఆచారం వెనుక అసలైన అర్థం లేకపోలేదు.
 
పురుషులు నడుము పైభాగాన వస్త్రాన్ని ధరించకుండా ఆలయంలోని విగ్రహం దగ్గరకి వెళ్లి ఆ స్వామి కృప తమకి లభించాలని ప్రార్ధిస్తారు. ఫలితంగా వాళ్ల మనసు పవిత్రమై ప్రశాంతతను సంతరించుకుంటుంది. అలాగే పురుషులు దేవుడి విగ్రహానికి దగ్గరగా వెళ్లినప్పుడు ఆ విగ్రహంలోని వివిధ భాగాల నుంచి వెలువడే కొన్ని శక్తి కిరణాలు వాళ్ల శరీరంలో ప్రవేశిస్తాయి. వాళ్లని వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu