Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యోదయము అయినట్లు కలవచ్చినట్లైతే..?

సూర్యోదయము అయినట్లు కలవచ్చినట్లైతే..?
, మంగళవారం, 5 మే 2015 (16:07 IST)
సూర్యుడు సముద్రము నుండి పైకి వస్తున్నట్లు, సూర్యోదయము అయినట్లు కలవచ్చినట్లైతే ధనలాభము, జయము కలుగును. ఆకాశంలో సూర్యుని వెలుగు కనిపించినట్లైతే ధనలాభం, ఆరోగ్యం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వర్తకులకు అధికలాభము కలుగును. ఆకాశంలో సూర్యాస్తమయం కనిపించినట్లైతే కీడు, వర్తకులకు అధిక ధననష్టము, యువతీ యువకులకు ప్రేమ వివాహములకు ఆటంకములు సంప్రాప్తించును.
 
తమ చుట్టూ సూర్యకిరణములు కమ్ముకుమ్మట్లు కలవచ్చినట్లైతే సంఘంలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగును. సూర్యుడు ఎర్రగా కవరు కమ్ముకుని వున్నట్లు కలవచ్చినట్లైతే నేత్రములలో జబ్బు కలుగును. తలచిన పనులు నెరవేరక అశుభములు కలుగును. ఏదైనా దొంగతనము కాని, నేరము కానీ చేసినవారికి ఈ కలవచ్చిన శుభములు జరుగును. 
 

Share this Story:

Follow Webdunia telugu