Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి రోజున శివపూజ ఎలా చేయాలి?

సంక్రాంతి రోజున శివపూజ ఎలా చేయాలి?
, మంగళవారం, 13 జనవరి 2015 (17:19 IST)
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. సూర్యుడు శ్రీమన్నారాయముడని, విష్ణుమూర్తిగానూ పూజలందుకుంటున్నాడు. ఆ రోజున నారాయణుడిని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంక్రాంతి రోజున ప్రదోష వేళలో పరమశివుడిని ఆరాధించడం ద్వారా అనేక శుభాలు లభిస్తాయి. 
 
సంక్రాంతి రోజున సాయంత్రం సదాశివుడికి 'ఆవునెయ్యి'తో అభిషేకం చేయడం, పరమశివుడి క్షేత్రంలో  'నువ్వుల నూనె'తో దీపం పెట్టడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. 
 
మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యనమస్కారం చేయడం వలన, లక్ష్మీనారాయణులను పూజించడం వలన, ఆ సాయంత్రం సదాశివుడిని ఆవునెయ్యితో అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని పురోహితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu