Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవాళికి కమలం అందించే సందేశం ఏమిటి?

మానవాళికి కమలం అందించే సందేశం ఏమిటి?
, శుక్రవారం, 15 మే 2015 (16:37 IST)
దేవతలు కమలం పూవులో నిల్చున్నట్లు లేదా కూర్చున్నట్లు వర్ణించారు. కమలం ఎరుపు లేదా తెల్లకమలంగా చూపేవారు. కమలం ఆసియాఖండమతాలన్నింటిలో కమలం ఒక పవిత్ర చిహ్నమే. కమలం అందాన్ని, దివ్యశక్తిని, లావణ్యానికి సూచనకాక, మనిషి దుర్గణాలైన ఆశ, కోపం, కామం, కసి, అహం వంటి దుర్గణాలకు అతీత చిహ్నంగా భావిస్తారు. 
 
కమలం పెరిగేది బురదలో, దుమ్మూ, ధూళీ, కంపు నీటిలో నుండి బయటకు వస్తుంది. అయినే అవేవి ఆ కమలానికి అంటవు. తన చుట్టూ వున్న చెడును అంటించుకోక, తనదైన పవిత్ర మార్గంలో ముందుకు స్వచ్ఛమైన పద్ధతిలో నడవడమన్నది మానవాళికి కమలం అందించే సందేశం.  
 
ఆ కమలంలోని ఆకర్షణలు పత్రాలు మనిషి మనసులోని పొరలను సూచిస్తాయి. ఆ పొరలను తొలగించుకుని, ఆ పూవులా విచ్చుకుని తనను తాను తెలుసుకుని ప్రవర్తించాలన్నది పెద్దలు కమలం ద్వారా తెలియజెప్పింది. కమలం భారత జాతీయ పుష్పం. భారతీయ నాగరికత చిహ్నం. 
 
లక్ష్మీదేవిని పద్మజ అనగా కమలం నుంచి ఉద్భవించిందని వర్ణించారు. విష్ణువుని కమల నయనుడు అంటే కలువపూల కళ్ళవాడు అని వర్ణించారు. దేవతల చేతులలో కమల పుష్పాలుండటం వర్ణనల్లో కనిపిస్తుంది. ఈ కమలాలను నళిని, అరవింద, ఉత్పల, కుమూద అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు.

Share this Story:

Follow Webdunia telugu