Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్జునా! ఎంతసేపని నాతో ఉంటావు? అలా వెళ్ళిరా!

అర్జునా! ఎంతసేపని నాతో ఉంటావు? అలా వెళ్ళిరా!
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (15:54 IST)
అర్జునుడు కృష్ణుడను సూర్యాన్ని అంటి పెట్టుకుని ఉంటూ, సూర్యుని చుట్టూ తిరిగే సూర్యప్రకాశం. అందువల్ల శ్రీ కృష్ణుడు- అర్జునా! ఎంతసేపని నాతో ఉంటావు? నా చుట్టే తిరుగుతావు? నా కొంగు పట్టుకుని నడుస్తావు? అలా వెళ్ళిరా. లోకాన్ని చూచిరా. విశ్వాన్ని అవలోకించి, ఆరాధించి, అర్థం చేసుకో. విశ్వంలో నన్ను అన్వేషించు. అంటూ అర్జునుడిని పంపిస్తాడన్నమాట. అలా గూడు విడిచి, లోకం చుట్టి వచ్చిన అర్జునుడు మళ్లీ శ్రీ కృష్ణుడినే ఆశ్రయిస్తాడు. 
 
నిజానికి సూర్యుడే విశ్వం. విశ్వమే సూర్యుడు. సూర్యుని చుట్టూ ఉన్నవి గ్రహాలు, నక్షత్రాలే!. ఒకప్పుడు గ్రహాలన్నీ సూర్యునిలోనిదే. ఇప్పుడు బయట ఉన్నాయి. రేపు మళ్లీ అవి ఆతనిలో కలిసిపోవచ్చు.
 
సూర్యునికి అనేక చేతులు, అనేకమైన కాళ్ళు, ఆయన లేక సృష్టిస్థితిలయలు లేవు. కాలము లేదు. దిక్కులు లేవు. చివరికి మనమూ లేము. మన జ్ఞానమూ లేదు. అతడు సకల దేవతా స్వరూపుడు. ఇదే అతని విశ్వరూపం. 
 
సూర్యుడు మనలోనూ ఉన్నాడు. ఆ విశ్వం మనలోనూ ఉంది. అర్జునుడు మనలోనూ ఉన్నాడు. అందువల్ల ఒక విధంగా ఆత్మబోధే భగవద్గీత. దాని ఆచరణే జీవన సమరం. దీన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే శ్రీకృష్ణుడు అర్జునుని విశ్వరూప దర్శనం చేయమంటాడు. ఈ క్రమంలో అర్జునుడు సూర్యుని అంటిపెట్టుకుని విశ్వరూప దర్శనం చేస్తాడు. ఇదే అర్జునుడి తీర్థయాత్ర. సూర్య కిరణం ఎలా పయనిస్తుందో.. అలాగే అర్జునుడు పయనించాడు. అది ఎన్ని చోట్లకు వెళ్తుందో అక్కడకల్లా వెళ్తాడు. భూమిపై సూర్యకిరణాలు విహరించేలా తాను విహరించాడు. 
 
అడవుల్లోకి తానూ సూర్యకిరణాల తరహాలో ప్రవేశించాడు. అది భూగర్భంలోకి చొచ్చుకుపోయినా తన ప్రతినిధి అయిన బాణాన్ని భూగర్భంలోకి పంపించి, భీష్మునికై పాతాళ గంగను పైకి తోడాడు. అది గగన విహారం చేస్తుంది. అందుకే అర్జునుడు స్వర్గానికి వెళ్ళొచ్చాడు. అది పర్వత శిఖరాల్ని చుంబిస్తుంది. అందుకే అతడూ పర్వతాలపై తపస్సు చేశాడు. అది సముద్ర గర్భంలోకీ ప్రవేశిస్తుంది. అందుకే అర్జునుడు సాగర గర్భంతో పాటు నాగలోకానికి వెళ్ళి నాగకన్యను వివాహమాడాడు. 

Share this Story:

Follow Webdunia telugu