అలిపిరి అంటే అర్థం ఎవరికైనా తెలుసా..!

కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి తొలి ప్రవేశమార్గం అలిపిరి. సోపానమార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే. కొందరు ఆడిప్పడి అంటారు. పడి అంటే మెట్టు. ఆడి అంటే అడుగున ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగు

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (12:30 IST)
కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి తొలి ప్రవేశమార్గం అలిపిరి. సోపానమార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే. కొందరు ఆడిప్పడి అంటారు. పడి అంటే మెట్టు. ఆడి అంటే అడుగున ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం.
 
కొందరు అలిపిరిని ఆడిప్పళి అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాలలో చింత చెట్టుకు ప్రాధాన్య మెక్కువ. నమ్మాళ్వారుకు చింతచెట్టు కిందనే జ్ఞానోదయమైందని పురాణాలు చెపుతున్నాయి. 
 
కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని అర్థమట. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహాలయం. ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది. విగ్రహాలు శిథిలమయ్యాయి. చివరకు అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలోని శిల్పకళ చిత్ర విన్యాసాలు చూడవచ్చు.
 
అన్నమయ్య కాలం నాటికీ ఈ ఆలయం ఉండేది. ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ చూడదగిన బొక్కసం ఉంది. అలిపిరిలోనే వృత్తాకారపు బండ ఉంది. శిథిలాయంలోని బండ రాగుల రాయిలా ఉంది. ఈ రెండు బండలు అలిపిరిలో చూడవచ్చు.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో వివాహ వేడుకలో విషాదం- పుచ్చకాయ తిని బాలుడి మృతి

NEET: నలందలో నీట్ సాల్వర్ గ్యాంగ్ అరెస్ట్.. నగదు, అడ్మిట్ కార్డులు స్వాధీనం

ప్రభుత్వ చీఫ్ విప్‌గా కారు డ్రైవర్ కుమారుడు- అసెంబ్లీలో విజయ్‌కి బలపరీక్ష.. అన్నాడీఎంకే నేతల మద్దతు

తమిళనాడు సీఎంకి స్పెషల్ ఆఫీసర్‌గా జ్యోతిష పండితుడు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్న ఉదయనిధి

Chain Snatching: వరంగల్‌లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

తర్వాతి కథనం