Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవ జన్మలో మనిషి చేయాల్సిందేమిటి...?

మానవ జన్మలో మనిషి చేయాల్సిందేమిటి...?
, గురువారం, 2 మే 2013 (17:48 IST)
FILE
మనిషికి కావాల్సిందేమిటి? భగవంతుని సాన్నిథ్యంలో శాశ్వతస్థానం పొందడం కాదా! మనిషిగా పుట్టిన వాడు సాధించాల్సింది ఆ స్థానం కోసమేనని మహాఋషులు, భోదకులు ప్రజలకు బోధించారు.

అన్ని జన్మలలోకి విలువైన మానవజన్మ చిట్టచివరిదని ఇక ఆ జన్మ తర్వాత మళ్ళీ ఇతర జన్మలోకి వెళ్ళకూడదని పెద్దలు చెప్పినది. మానవజన్మలో చేసే అధర్మం తిరిగి జంతుజన్మలోకి తీసుకెళుతుంది. అలా వెళ్ళటమంటే వెనక్కి నడవటం. ప్రయాణం అలా వెనక్కు సాగించటానికి, ముందుకు నడచి భగవంతుని సుందర రూపం దర్శిస్తూ నిరంతరం ఆయన కొలువులోనే కూర్చునేందుకు ముందుకు వెళ్ళటానికి ఎంతో తేడా ఉంది.

దేవుడిని ఎన్నో పేర్లతో పిలుస్తుండవచ్చు. ఎన్నో రకాల ఆరాధనా మార్గాలు ఉండవచ్చు. కానీ ఆయన ఆదేశించేది ఖరీదైన నైవేద్యాలు, రంగురంగుల అలంకరణలు, మైకులు పెట్టి ప్రార్థనలకు పిలవడం కాదు. పొరుగు వారిని గౌరవంగా చూస్తూ, ఆ భగవంతునికి పూర్తిగా తనను తానుగా అంకితం చేసుకుని జీవించడం. నీవు తప్ప మరెవరూ లేరు అన్న వినమ్ర నివేదనను ఆయన ఆశించేది. ఆ కోరికనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu