Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరటినార వత్తులతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి?

అరటినార వత్తులతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి?
File
FILE
గృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వాస్తవానికి వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం.

మంచి పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుందట.

అదేవిధంగా అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుందని చెపుతున్నారు. జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుందని, పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెపుతున్నారు.

వత్తులను పన్నీరులో అద్ది నేతితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందని చెపుతున్నారు. అదేవిధంగా కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోవడమే కాకుండా, ఇంటిపై ఎలాంటి మాంత్రికశక్తులు పని చేయవని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu