Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగవాన్ సత్యసాయి సూక్తులు

భగవాన్ సత్యసాయి సూక్తులు
, సోమవారం, 17 నవంబరు 2008 (17:33 IST)
"మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు. నా మార్గంలో గాని, మరో మార్గంలో గాని శిష్యులను, భక్తులను ఆకర్షించడం నా అభిమతం కాదు.... విశ్వవ్యాప్తమైన, ఏకమైన ఆధ్యాత్మిక సూత్రం - ప్రేమ అనే మార్గం, ధర్మం, బాధ్యత - ఈ ఆత్మ సత్యాన్ని చెప్పడానికే వచ్చాను" అంటాడు సత్యసాయి.

"ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వ భావంతో ఏకం చేయడానికి, ఆత్మ సత్యాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ సాయి వచ్చాడు. మనిషినీ మనిషినీ జోడించే ఈ దివ్య సంప్రదాయమే విశ్వాధారమైన సత్యం. ఇది తెలుసుకొంటే మనిషి పశుత్వం నుండి ఎదిగి దివ్యత్వం సాధించగలడు. అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శవంతమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి. కాని ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దు" అంటూ జాతికి తన సందేశాన్ని అందించాడు.

"తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని వీడమనీ ప్రతి మతం ఉద్బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకొని మోక్షాన్ని సాధించుకోవడాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాలలోనూ వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతునే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుని ఆరాధించడానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్య భావాన్ని అవగతం చేసుకోండి." అంటూ ప్రేమభావాన్ని ఈ లోకానికి చాటి చెప్పారు సత్యసాయి.

Share this Story:

Follow Webdunia telugu