Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య ఎదుట పరాయి స్త్రీ వక్షోజాలను పొగిడితే అంతే సంగతులే?

భార్య ఎదుట పరాయి స్త్రీ వక్షోజాలను పొగిడితే అంతే సంగతులే?
, మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (16:58 IST)
File
FILE
ఒక యువతి లేదా మహిళకు అందం, ఆకర్షణ పూర్తిగా వక్షోజ సైజుల్లోనే ఇమిడి వుంటుంది. ఇది నగ్న సత్యం కూడా. స్త్రీని చూడగానే ఇట్టే ఆకర్షించే శరీర భాగాల్లో అతి ముఖ్యమైనవి వక్షోజాలు. అయితే, వీటి రూపురేఖల గురించి ప్రియుడు లేదా భర్త మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అలాకాకుండా, పరాయి స్త్రీల వక్షోజాల గురించి తమ భార్యలు, ప్రియురాళ్ళ వద్ద చర్చించినా.. పొగిడినా వారు ఆత్మనూన్యతా భావానికి లోను కావడమే కాకుండా, ఒకింత బాధపడుతూ, భర్త/ ప్రియుడిపై కోపం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందువల్ల తన ప్రేయసి లేదా భాగస్వామి వక్షోజాకృతులను కించపరుస్తూ మరొకరి వక్షోజ అందాలను పోల్చుతూ మాట్లాడరాదని సలహా ఇస్తున్నారు. ఎద అందాలు ప్లాట్‌గా ఉన్నాయనీ, ఇంక రెడీమేడ్ కప్పులే గతి అంటూ గేలి చేస్తూ విమర్శించరాదంటున్నారు.

ఎప్పుడైనా ఏకాంతంలో వక్షోజాలు కనబడేట్లు ఆమె ప్రవర్తిస్తే మెచ్చుకోకపోయినా ఫర్లేదు కానీ కించపరుస్తూ మాట్లాడరాదని చెపుతున్నారు. అలా చేస్తే ఆమె మనసు గాయపడుతుంది. వక్షోజ సైజులు గురించి తరచూ మాట్లాడటం, పొద్దస్తమానం వాటి గురించి ధ్యాసంతా అన్నట్లు ఉండరాదని హితవు పలుకుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu