Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూజగదిలో శివలింగం వుంటే... స్నానం చేసిన తర్వాతే?

నవగ్రహాల్లో బుధుడికి ప్రీతికరమైన మరకతాన్ని ధరించడం ద్వారా శుభఫలితాలు వుంటాయి. అలాగే మరకతంతో తయారైన శివ లింగాన్ని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కోరిన వరాలు నెరవేరుతాయి. నవర

పూజగదిలో శివలింగం వుంటే... స్నానం చేసిన తర్వాతే?
, బుధవారం, 12 జులై 2017 (17:53 IST)
నవగ్రహాల్లో బుధుడికి ప్రీతికరమైన మరకతాన్ని ధరించడం ద్వారా శుభఫలితాలు వుంటాయి. అలాగే మరకతంతో తయారైన శివ లింగాన్ని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కోరిన వరాలు నెరవేరుతాయి. నవరత్నాల్లో ఒకటైన మరకతానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. అలాంటి మరకతాన్ని లింగ రూపంలో పూజించడం ద్వారా అన్నీ రంగాల్లో రాణిస్తారు.
 
విద్య, ఆరోగ్యం, ఉన్నత పదవులు లభించాలంటే.. మరకత లింగాన్ని పూజించడం ద్వారా ప్రాప్తిస్తాయి. అలాగే వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే.. మరకత లింగాన్ని పూజించాలి. అంతేగాకుండా మరకత లింగాన్ని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ లింగాన్ని నిష్ఠతో ప్రార్థించే వారికి ఒత్తిడి మాయమవుతుంది. అలాగే ఇంటనున్న ప్రతికూల శక్తులను తొలగిపోతుంది. అలాగే అనుకూలత చేకూరుతుంది. 
 
ఈ మరకత లింగమో లేకుంటే వేరేదైనా శివలింగం ఇంట్లో వుండినట్లైతే... నియమం ప్రకారం పూజించాలి. శివలింగానికి ముందుగా వీరు, పాలు, తేనె, పెరుగు, పంచామృతాలతో అభిషేకించాలి. ఆపై బిల్వ పత్రాలు, చందనం, విభూతితో అభిషేకించి.. దీపారాధన చేయాలి. పూజ గదిలో శివలింగం వుంటే స్నానం చేశాకే ఎవరైనా పూజగదిలోకి ప్రవేశించాలి. 
 
మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. పండ్లు, పువ్వులతో రోజూ అర్చించాలి. శక్తిమేరకు ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ప్రదోషకాలంలో తప్పక శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా శివలింగాన్ని ఇంట వుంచి పూజ చేయడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు వుండవు. వృత్తిపరమైన అభివృద్ధి వుంటుంది. ఇంట పండగ వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. మోక్షం సిద్ధిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ రాశి ఫలితాలు(12-07-2017)... కొత్త పరిచయాలతో లబ్ది...