Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనుమంతుడికి సమర్పించే వడ మాలకు రాహు గ్రహానికి సంబంధం ఏమిటి? మీకు తెలుసా?

హనుమంతుడికి సమర్పించే వడ మాలకు రాహు గ్రహానికి సంబంధం ఏమిటి? మీకు తెలుసా?
, మంగళవారం, 19 జనవరి 2016 (18:29 IST)
రామ భక్తుడు అయిన హనుమంతునికి వడలతో చేసిన మాలను ఎందుకు సమర్పిస్తారో తెలుసా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. అంజనా దేవికి, వాయు భగవానుడికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో ఆకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు. వాయుపుత్రుడు కావడంతో.. ఆకాశానికి రువ్వున ఎగిరేశాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు అలా ఆకాశానికి ఎగిరెళ్లడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. 
 
అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిపై అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అలా వజ్రాయుధం హనుమంతుడి గడ్డాన్ని తాకింది. తద్వారా హనుమంతుని గడ్డానికి గాయమేర్పడి.. కుంచించుకుపోయింది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతుడుగా అని పిలువబడెను. బాల హనుమంతుడు సూర్యుడిని పట్టేందుకు వెళ్తున్న రోజునే సూర్యగ్రహణం కావడంతో.. సూర్యుడిని పట్టేందుకు రాహువు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ కారణంతో సూర్యుడిని రాహువు పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకుని.. వేగంలో తనను మించిపోయిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు ఆంజనేయుడికి ఓ వరం ప్రసాదించాడు.
 
ఆ వరం ఏమిటంటే..? రాహువుకు ప్రీతికరమైన ధాన్యమైన మినుములతో గారెలు చేసి వాటిని మాలలాగా తయారు చేసి ఎవరు హనుమంతునికి సమర్పిస్తారో వారిని రాహు గ్రహంతో ఏర్పడే బాధలు, దోషాల నుంచి విముక్తుల్ని చేస్తానని, వారిని ఎప్పటికీ ముట్టబోనని వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. (తనకు (రాహువుకు) ప్రీతికరమైన మినుములతో గారెలు చేసి తన శరీరం పోలిన అంటే పాము లాంటి ఆకారంలో మాలగా వడలను ఆంజనేయునికి సమర్పిస్తే.. రాహు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం).

అందుచేతనే మినపప్పుతో కూడిన గారెలను తయారు చేసి 54, 108, లేదా 1008 అనే సంఖ్యలో హనుమంతునికి మాలగా సమర్పించిన వారికి రాహు దోషాలంటవని పంచాంగ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu