Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జలతత్త్వ రాశులు ఏవి? బావి త్రవ్వేందుకు ఏ లగ్నం మంచిది?

జలతత్త్వ రాశులు ఏవి? బావి త్రవ్వేందుకు ఏ లగ్నం మంచిది?
, మంగళవారం, 9 జూన్ 2015 (18:33 IST)
గృహానికి తూర్పు దిక్కున బావి త్రవ్వినచో, నీటి వసతికి ఏర్పాటు చేసిన సంపత్ వృద్ధి. ఈశాన్యంలో సౌఖ్యం, ఉత్తరాన అల్పసుఖం, గృహమధ్యలో ధననష్టం, వాయవ్యంలో శత్రుబాధ, నైరుతిలో మృత్యుభయం, దక్షిణాన భార్యావియోగం, ఆగ్నేయంలో పుత్రనాశనం సంభవిస్తుంది. కనుక యుక్తమయిన దిశ చూసుకుని నీటి వనరు ఏర్పాటు చేసుకోవాలి. 
 
అష్టమశుద్ధి చూసుకుని, గురు-శుక్ర-చంద్ర గ్రహములతో కూడియున్న లగ్నములు జలతత్త్వ రాశులైన కర్కాటక, మకర, కుంభ, మీన లగ్నములు, సోమ, బుధ, గురు, శుక్రవారాలు బావి తవ్వేందుకు శ్రేష్ఠం. నక్షత్రాల విషయానికి వస్తే రోహిణి, మఖ, హస్త, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుష్యమి, అనూరాధ, ధనిష్ట, శతభిషం, రేవతి నక్షత్రాలు శ్రేష్ఠం. 
 
తిథులలో శుక్లపక్షం అయితే.. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి తిథులు మినహా మిగిలినవన్నీ మంచివి. బహుళపక్షం అయితే కేవలం పాడ్యమి మంచిదని గ్రహించాలి. ఇల్లు కట్టేముందే ప్రహరీ గోడలు నిర్మించి ఈశాన్యంలో నీటివనరు ఏర్పాటు చేసుకుని.. అనంతరం ఇల్లు కట్టడం శ్రేయస్కరం. 

Share this Story:

Follow Webdunia telugu