Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరట్లో పూలచెట్లు ఉన్నట్లు కలలో కనిపిస్తే..?

పెరట్లో పూలచెట్లు ఉన్నట్లు కలలో కనిపిస్తే..?
, సోమవారం, 18 ఆగస్టు 2014 (17:32 IST)
పెరట్లో పూలచెట్టు, పండ్ల మొక్కలు, బావి ఉన్నట్లు కనిపిస్తే గుణవతి అయిన భార్య, పేరు కలిగిన పుత్రులు కలుగుతారు. అలాగే పచ్చని పైరు మీద నడిచిపోతున్నట్లు కనబడితే జీవితంలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది. పొలం పైరు పంటలతో కనిపిస్తే ధనలాభం.
 
పచ్చటి పచ్చిక గల భూమి కలలో కనిపిస్తే అందమైన భార్య లభిస్తుంది. ఇంకా ఐశ్వర్యము, సంతోషము కలుగుతుంది. ఎవరైనా భూదానం తనకు చేసినట్లు కలవస్తే పెళ్ళి కాని వారికి పెళ్ళి, పెళ్ళైన వారికి స్త్రీ వలన ధన లాభం కలుగుతుంది.
 
హద్దులు లేని భూములు కనిపిస్తే అంతులేని సంతోషం, ధనం లభిస్తాయి. గోడ, మేడ, ఇల్లు, నిచ్చెన ఎక్కినట్టు కలవస్తే సంతోషం కలిగే వార్తలు వింటారు. ఇల్లు కట్టుకుంటున్నట్లు కలలో కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది. 
 
చెట్టు ఎక్కినట్లు కలవస్తే ఆరోగ్యం, ధనలాభం, విందు భోజనం, కార్యజయము లభ్యమవుతాయి. అయితే మెట్లు లేని కొండ ఎక్కినట్లు కనిపిస్తే ఆపదలు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu