Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉదయం నిద్రలేవగానే అద్దాన్ని చూస్తే.. ఏం జరుగుతుంది?

ఉదయం నిద్రలేవగానే అద్దాన్ని చూస్తే.. ఏం జరుగుతుంది?
, మంగళవారం, 31 మార్చి 2015 (13:50 IST)
ఉదయం నిద్రలేవగానే అద్దాన్ని చూస్తే ఏం జరుగుతుందని తెలుసుకోవాలా.. అయితే ఈ స్టోరీ చదవండి. ఉదయం నిద్రలేవగానే ఆవునుగానీ, అద్దాన్ని గానీ, తల్లిదండ్రులను గానీ, భార్యను గానీ చూడటం ఆచారంగా కనిపిస్తోంది. అయితే పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక కారణం లేకపోలేదు. 'అద్దం' లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఉదయాన్నే అద్దం చూడటం వలన లక్ష్మీదేవి మోమును చూసినట్టు అవుతుంది.
 
ఇక ఆవు సకలదేవతా స్వరూపమని సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి కనుక, ఆవును చూడటం వలన సమస్త దేవతలను దర్శించినట్టు అవుతుంది. ఇక అర్థాంగి ఎప్పుడూ కూడా తన భర్త శ్రేయస్సునే కోరుకుంటుంది. ఆయన కోసమే వ్రతాలు ... నోములు చేస్తూ ఉంటుంది. అందువలన ఇంటికి దీపంలాంటి ఇల్లాలి ముఖాన్ని చూడటం వలన అంతా మంచే జరుగుతుందని అంటారు. 
 
ఇక మమతలే తప్ప మహిమలు ఎరుగని దేవుళ్లు ... అమ్మానాన్నలు. అలాంటి అమ్మానాన్నలు తాము ఎలా ఉన్నా తమ బిడ్డలు సంతోషంగా ... క్షేమంగా ఉండాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారు. ఉదయాన్నే వారిని చూడటం వలన లక్ష్మీనారాయణులను, శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu