Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెల్లజిల్లేడు పూలతో సూర్యుడిని పూజిస్తే..?

తెల్లజిల్లేడు పూలతో సూర్యుడిని పూజిస్తే..?
, బుధవారం, 12 నవంబరు 2014 (18:48 IST)
జాతకం ప్రకారం రవి అనుగ్రహం లభించాలంటే.. సూర్యుడిని పూజించాలంటున్నారు.. పంచాంగ నిపుణులు. రవి స్థితి బాగోలేకపోతే.. బంధుమిత్రులతో గొడవలు పడటం, పై అధికారుల ఆగ్రహానికి గురికావడం, మోసానికి గురవడం, ఒంటరిగా మిగిలిపోవడం, నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి. 
 
సూర్యుడు చూపే ప్రతికూలత కారణంగానే ఈ కష్టాలు అనుభవించడం జరుగుతూ వుంటుంది కాబట్టి, ఆయన నుంచి అనుకూలత పొందడానికి ప్రయత్నం చేయాలని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
సూర్యుడి అనుగ్రహాన్ని పొందాలంటే.. 'తెల్లజిల్లేడు చెట్టు'ను పూజించడం అనేది వాటిలో ఒకటిగా కనిపిస్తుంది. తెల్లజిల్లేడు చెట్టును పూజించడం వలన సూర్యుడు ప్రసన్నుడవుతాడని చెప్పబడుతోంది. రవి అనుగ్రహం వలన ఆ గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయడం జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu