Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవగ్రహాల శాంతి కోసం స్నానాలు కూడా చేయొచ్చట!

నవగ్రహాల శాంతి కోసం స్నానాలు కూడా చేయొచ్చట!
, గురువారం, 18 డిశెంబరు 2014 (12:52 IST)
నవగ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం.. దాని తాలూక దోషం ... ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి నానారకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
 
కుంకుమ - ఎర్ర చందనం కలిపిన 'రాగిపాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ - గంధం కలిపిన నీటిని 'శంఖం'తో పోసుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం - తిలలు కలిపిన 'రజిత పాత్ర'లోని నీటితో స్నానమాచరించడం వలన కుజదోషాల బారినుంచి బయటపడవచ్చునని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
ఇక నదీ సాగర సంగమంలోని నీటిని 'మట్టిపాత్ర'లో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు వదలిపోతాయి. మర్రి - మారేడు కాయలను బంగారుపాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ 'రజిత పాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
 
ఇక నువ్వులు ... మినువులు కలిపిన 'లోహపాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు ... పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించడం వలన ఆయా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu