Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలలో నక్షత్రములు ధగ ధగ మెరిసిపోతుంటే..?

కలలో నక్షత్రములు ధగ ధగ మెరిసిపోతుంటే..?
, శుక్రవారం, 8 మే 2015 (18:23 IST)
కలలో నక్షత్రములు ధగ ధగ ప్రకాశవంతంగా మెరిసిపోతున్నట్లు కనిపిస్తే.. జయము, కార్యలాభము కలుగును. నక్షత్రములు కనీ కనిపించక ఉన్నట్లైతే.. మబ్బు నక్షత్రములపై కమ్మినట్లు కలవస్తే కష్టనష్టములు కలుగును. ఆకాశములో నక్షత్రములు కనపడలేదని అనుమానము కలిగినట్లు కల వచ్చినచో ఎంతటి ధనవంతులైననూ దరిద్రలగుదురు. 
 
ఆకాశము నుండి నక్షత్రములు కిందకి ఇంటిపై పడుతున్నట్లు కల వచ్చినచో అనారోగ్యము, గృహ దహనము, ఆప్తుల మరణము సంభవించును. తోకచుక్కలు నేలపైకి వస్తున్నట్లు కలలో కనబడినట్లైతే ఆపదలు కలుగుతాయి. పడమర ఇంద్రధనుస్సు కనబడినట్లు కలవచ్చినచో ధనవంతులగుదురు. ధనలాభము కలుగును. ఇంద్ర ధనుస్సు దగ్గరగా గాని, తన నెత్తిమీద ఉన్నట్లు కలగంటే.. దరిద్రులకు ధనలాభం కలుగును. ధనవంతులకు ధన నష్టము జరుగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu