Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలారం గడియారం మోగుతున్నట్లు కల వస్తే..?

అలారం గడియారం మోగుతున్నట్లు కల వస్తే..?
, శుక్రవారం, 22 మే 2015 (18:36 IST)
అలారం గడియారం మోగుతున్నట్లు కల వచ్చినట్లైతే అశుభ వార్తలు వచ్చును. అల్యూమినియం పాత్రలు తళతళ మెరుస్తూ కనిపించిన అధిక సౌఖ్యములు, మసిబారియున్న చికాకులు, పనుల యందు ఆటంకములు కలుగును. అల్లిక పనిచేస్తున్నట్లు కల వచ్చినట్లైతే కుటుంబం వృద్ధి అగును. ఇంటిని పరిశుభ్రముగా అందంగా అలంకరించినట్లు కల వస్తే ఆ ఇంటిలో శుభకార్యములు జరుగును. 
 
అబద్ధము చెప్పినట్లు కల వచ్చినట్లైతే అనేక ఆపదలు కలుగును. ఏదైనా వస్తువును అమ్ముతున్నట్లు కల వచ్చినట్లైతే పేదవాళ్ళకు లాభము కలుగుతుంది. భాగ్యవంతులకు, రోగులకు కీడును కలుగుజేస్తుంది. కన్యలు మెడనిండా ఆభరణాలు ధరించినట్లు కలవస్తే ఆనందము, అనేక రకాల లాభములు కలుగును. కన్యలకు త్వరలో వివాహము జరుగును. 

Share this Story:

Follow Webdunia telugu