సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే కొన్ని గ్రహాల కలయిక కూడా ఇదే రోజున జరుగుతుంది. దీనిని బట్టి ఎన్నో శుభాలు జరుగుతాయి. కానీ ఈ ఏడాది సూర్యుడు మకరంలోకి వెళ్లడం ఒకవైపు జరుగుతుంటే.. మకర సంక్రాంతికి సరిగ్గా రెండు రోజులు కుజుడు కూడా మకరంలోకి ప్రవేశించడం జరుగుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.
దీని కారణంగా సూర్య కుజ సంయోగం కూడా జరుగుతుంది. అలాగే అప్పటికి శుక్రుడు కూడా అదే రాశిలో ఉండడం వల్ల ఈ మూడు గ్రహాల సంయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా జనవరి 16వ తేదీన రుచిక రాజయోగం కూడా ఏర్పడుతుందని వారు అంటున్నారు. ఈ రాజయోగం వల్ల మేషం, వృషభం, సింహం, మీనరాశి జాతకులకు అదృష్ట యోగం ఏర్పడనుంది.
మేషరాశి వారికి ఈ రాజయోగం జీవితంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించి ఉద్యోగాల్లో రాణించగలుగుతారు. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి సంచారం కారణంగా అదృష్టం చాలా వరకు కలిసి రాబోతోంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. కుటుంబం, సోదరులు మీ పక్కనే ఉండడం వల్ల వారి సలహాలతో ముందుకు సాగుతారు.
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడి సంచారంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా తోబుట్టుల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆలోచించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
ఇక మీన రాశి వారికి అద్భుతమైన ధైర్యాన్ని అందిస్తుంది. దీనివల్ల వీరు కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అనుకున్న పెద్ద పెద్ద కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. ఆరోగ్యం కూడా తిరిగి మెరుగుపడుతుంది.
సంక్రాంతి సమయంలో, వృశ్చిక రాశి వారికి శుక్ర-బుధ సంయోగం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రావచ్చు. కష్టపడి పనిచేయడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయి.