Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపం ఉన్నట్లు కల వచ్చినట్లైతే...? స్త్రీకి ఆ కల వచ్చినచో..?

దీపం ఉన్నట్లు కల వచ్చినట్లైతే...? స్త్రీకి ఆ కల వచ్చినచో..?
, శనివారం, 6 జూన్ 2015 (17:44 IST)
దీపం ఉన్నట్లు కల వచ్చినట్లైతే ఆపదలన్నీ తొలగిపోయి, శత్రువులు మిత్రులుగా మారుట, స్నేహితులు సహాయం చేయడం వంటి శుభసూచకాలుంటాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అదే దీపం కానీ, కాగడా కానీ ఇతరులెవ్వరైనా పట్టుకున్నట్లు కల వచ్చినట్టైతే తనకు అపకారము చేసినవారికి కోలుకోలేని అపకారము జరుగును. 
 
తాను వెలిగించిన దీపం కానీ, కాగడా కానీ ఎక్కువ మంటతో ప్రజ్వరిల్లుతున్నట్ల కలగాంచినట్లైతే సంఘంలో గౌరవ ప్రతిష్టలు, సన్మానములు జరుగును. స్త్రీకి ఆ కల వచ్చినచో తేజోవంతుడు, దీర్ఘాయుష్మంతుడైన కుమారుడు జన్మించుననని జ్యోతిష్య పండితులు అంటున్నారు. 
 
దీపం కాని, కాగడా కాని ఏదైనా వెలిగించకపోయినా వెలగక, ఆరిపోవుట సంభవిస్తే దారిద్ర్యము, తన సంతానము నశించుట జరుగును, ఇల్లు కాలుతున్నట్లు రవ్వలు ఎగురుతూ పొగ కనిపించినట్లైతే కీడు, ధన నాశనం కలుగును. ఇంటిలో ఏ భాగము కాలుతుందో ఆ భాగము కలవారికి ఎక్కువగా కష్టములు విపరీతమైన జబ్బులు కలుగును. వంట ఇల్లు అయినచో ఇంట్లోని ఆడవారికి, పశువుల శాల అయినా పశువులు నశించును. 

Share this Story:

Follow Webdunia telugu