Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్ష్మీదేవిని ఆ రోజు పూజిస్తే.. ఆర్థిక సమస్యలుండవట!

లక్ష్మీదేవిని ఆ రోజు పూజిస్తే.. ఆర్థిక సమస్యలుండవట!
, గురువారం, 9 అక్టోబరు 2014 (18:50 IST)
ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా? అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేయండి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏరోజు పడితే ఆరోజు కాకుండా కొన్ని ప్రత్యేక తిథుల్లో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాంటి రోజుల్లో ఒకటిగా 'ఆశ్వయుజ పౌర్ణమి' కనిపిస్తుంది. దీనినే 'కౌముదీ పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న ఈ రోజున, ఉదయాన్నే తలస్నానం చేసి ... పూజా మందిరంలోని అమ్మవారిని అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. అమ్మవారికి సంబంధించిన పారాయణాలు ... భజనలతో 'జాగరణ' చేయాలి.
 
ఈ రోజున రాత్రి వేళలో అమ్మవారు తప్పనిసరిగా సంచరిస్తుందని విశ్వాసం. ఈ సమయంలోనే అమ్మవారు తన భక్తులను అనుగ్రహిస్తుందనీ ... ఐశ్వర్యంతో పాటు దానిని అనుభవించే ఆయురారోగ్యలను కూడా ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu