Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంఖ్యాశాస్త్రము: ఫిబ్రవరిలో పుట్టినవారైతే..?

సంఖ్యాశాస్త్రము: ఫిబ్రవరిలో పుట్టినవారైతే..?
, మంగళవారం, 27 జనవరి 2015 (15:51 IST)
సంఖ్యాశాస్త్రము ప్రకారం ఫిబ్రవరిలో పుట్టిన వారు అతిగా మాట్లాడుతారట. ముక్కోపము, మిత్ర వాత్సల్యము కలిగివుంటారు. మంచి తెలివితేటలు, విద్యావివేకములు కలుగును. అశాంతి నుంచి శాంతిని సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. దివ్య శక్తులకు, మహిమలకు ఈ జాతకులు ప్రలోభపడుతారు. 
 
గంభీరమైన ఆలోచనలు కలిగి ఆదర్శవాదులుగా వుంటారు. ఇతరుల అభిప్రాయములు, గుణములు త్వరగా గ్రహించే శక్తి వీరికుంటుంది. వీరికి ప్రేమ, క్రోధము కూడా ఎక్కువగా వుంటాయి. వీరికి చాలా పెంకితనము, అనుమానములెక్కువ. 
 
నూతన విధానములను కనిపెట్టడం పట్ల కూతుహలము ఉంటుంది. మిత్రులకు సహాయము చేయుటకు ముందుంటారు. వశీకరణ శక్తి, ఇతరులను ఓదార్చు శక్తి వీరికి సహజ లక్షణము అని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu