Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోధుమలు కలలో కనబడితే ఫలితం ఏమిటి?

గోధుమలు కలలో కనబడితే ఫలితం ఏమిటి?
, మంగళవారం, 23 జూన్ 2015 (19:06 IST)
గోధుమలు కానీ గోధుమలు పండే పొలములు కానీ కలలో చూసినట్లైతే ధనలాభము కలుగును. అధిక సౌఖ్యము, సంతోషము, కోర్టు వ్యవహారములలో విజయము చేకూరుతుంది. 
 
గోధుమలు సాధువులకు ఇచ్చుచున్నట్లు కల వస్తే విశేష కీర్తి ప్రతిష్టలు కలుగును. అయితే చిక్కుడు కాయలు తినుచున్నట్లు కలవస్తే చేయు పనుల్లో ఆటంకాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
చిన్న చిన్న పండ్లు తినుచున్నట్లు కల వచ్చినట్లైతే అశాంతి, ఆవేదన కలుగును. చింతపండు కలలోకి వచ్చినట్లైతే స్త్రీల వలన అనేక నష్టములు కలుగును. వర్తకులకు ధన నష్టము కలుగును. 

Share this Story:

Follow Webdunia telugu