డిసెంబర్ 13, 2025, శనివారం.. జీవితంలో వుండే తీవ్ర సమస్యలను దూరం చేసే శక్తివంతమైన రోజు అని జ్యోతిష్య, ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ రోజున తప్పకుండా దైవ ఆరాధన చేయాలని వారు అంటున్నారు. ఈ రోజున కృష్ణపక్ష నవమి తిథి, శనివారం కలిసి రావడం ద్వారా తలరాతను మార్చే శక్తి వంతమైన ఫలితాలను పొందే అద్భుతమైన రోజుగా పరిగణిస్తున్నారు. కృష్ణపక్ష నవమి తిథి, శనివారం కలయిక విశేషమైనది.
సాధారణంగా, అష్టమి, నవమి వంటి తిథిలలో శుభకార్యాలను నివారించడం ఆచారం. కానీ నిర్దిష్టమైన దైవ ఆరాధనలకు ఈ రోజులు అనుకూలమైనవని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ తిథి అత్యంత శక్తివంతమైనది. ఈ నవమి రోజున చేసే పూజ జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. ఇదే రోజున అష్టమి కూడా మధ్యాహ్నం వరకు వుండటంతో కాలభైరవ పూజ ఈతిబాధలను తొలగిస్తుంది.
నవమి, అష్టమి తిథుల్లో తీర్థయాత్రులు, మంత్రజపం, మంత్రోపదేశం, హోమాలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ముఖ్యంగా కృష్ణపక్ష నవమి రోజున కుమార స్వామి ఆరాధన ద్వారా కుజ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి కోసం వ్రతం ఆచరించడం ద్వారా కర్మ ఫలితాలు కరిగిపోతాయి. పుణ్యఫలం చేకూరుతుంది. ఇంకా ప్రతికూలతలు తరిగిపోతాయి.
జీవితంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున పది రూపాయలు ఖర్చు చేస్తే జీవితంలో పురోగతి సాధిస్తారు. ఈ రోజున పది రూపాయలు ఖర్చు చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తమలపాకుల దీపం వెలిగించడం ద్వారా జీవితంలో ఇబ్బందులకు గురిచేసే కర్మ ఫలాలు తొలగిపోతాయి.
ఈ దీపం మీ తలరాతనే మార్చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. నవమి తిథి రోజున అమ్మవారిని పూజించడం, కుమార స్వామిని కొలవడం సమస్త దోషాలను దూరం చేస్తుంది. అలాగే కృష్ణపక్ష నవమి తిథి రోజున వారాహి అమ్మవారిని పూజిస్తే.. ఆర్థిక ఇబ్బందులు వుండవు. అప్పుల బాధ వుండదు. శత్రుభయం వుండదు. నరదృష్టి నుంచి విముక్తి లభిస్తుంది.
అందుకే కృష్ణపక్షంలో వచ్చి నవమి తిథి శనివారం రావడంతో ఆ రోజు సాయంత్రం కాలభైరవుడు, వారాహి దేవిని తలచి ఇంట్లో లేదా, ఆలయాల్లో ఒకే ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం కర్మను తొలగిస్తుంది. వీరిని నిష్ఠతో పూజిస్తే, వారికి చెందిన మంత్రాలతో జపిస్తే.. ఈతిబాధలు పటాపంచలవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అలాగే ప్రతి నెల నవమి తిథుల్లో చేసే చండీహోమానికి శాపాలు, అడ్డంకులను దూరం చేసే శక్తి వుంటుంది. ఇంకా శ్రీ మహాలక్ష్మీ కటాక్షం దక్కుతుంది. శత్రువులను సైతం స్నేహితులుగా మార్చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.