Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ రాశి ఫలితాలు (10-07-17) : నూతన పరిచయాలు...

మేషం: కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు లాభదాయకం. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంద

మీ రాశి ఫలితాలు (10-07-17) : నూతన పరిచయాలు...
, సోమవారం, 10 జులై 2017 (12:18 IST)
మేషం 
కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు లాభదాయకం. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కష్టకాలంలో బంధువులు అండగా నిలుస్తారు. 
 
వృషభం
దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మిథునం 
స్థిరచరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. అనుకున్న సమయంలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులను ఎదుర్కొనక తప్పదు. ఇతరుల విషయాలకు, హామీలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
కర్కాటకం
క్రయ, విక్రయదార్లకు యోగప్రదంగా ఉండగలదు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. 
 
సింహం
ఆర్థిక లాభాలు, అప్రయత్న కార్యసిద్ధి. కొత్త ఊహలలో కష్టమైన పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారులకు పురోభివృద్ధి. రాత పరీక్షలయందు మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. సంఘంలో ఆదరణ, ప్రయత్నం, కార్యసిద్ధి ఆలోచనలు కలసివస్తాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. 
 
కన్య
వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. రాజకీయ పారిశ్రామిక రంగాలవారికి యోగదాయకం. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. నిత్యావసర సరకుల స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
తుల
కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. రుణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవజ్ఞుల సలహా పాటించండి. విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ అనుకూలం. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయ సంతృప్తి ఉండదు. 
 
వృశ్చికం
కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగి వున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఎంత ధనమైనా వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో ఏకాగ్రత అవసరం. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
ధనస్సు 
ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మకరం
ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసి వస్తుంది. మీ ఔదర్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
కుంభం 
సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ తప్పదు. 
 
మీనం
కీలకమైన వ్యవహారాల్లో మీ జీవితభాగస్వామి సలహా ఎంతగానో ఉపకరిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. విద్యార్థులకు దూర ప్రదేశంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ రాశి ఫలితాలు (09-07-17) : దైవ కార్యాల్లో పాల్గొంటారు...