* కప్పుతో కాఫీ గానీ టీ గానీ త్రాగుచున్నట్లు కల వచ్చినట్లైతే అదృష్టము కలిసి వచ్చును.
* నీటిలో కర్ర తేలుతున్నట్లు కల వచ్చినట్లైతే నిరుపయోగమైన ఆలోచనలు కలుగును.
* కర్రను నరుకుచున్నట్లు కల వచ్చినట్లైతే ధన నష్టము కలుగును.
* కర్రల మోపు మోయుచున్నట్లు కల వచ్చినట్లైతే ఆస్తి నష్టము కలుగును.
* కర్రను నిప్పులోకి విసిరినట్లు కల వచ్చినట్లైతే ధన నష్టము కలుగును
* కిరీటము ధరించునట్లు కల వస్తే ఆపదలు సంభవించును.
* రత్నాలు, వజ్రాలతో పొదగబడిన కిరీటము ధరించినట్లు కల వచ్చినట్లైతే స్నేహితులు అసూయ, ద్వేషముతో ప్రవర్తించెదరు.