Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2015 కన్యా రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి....

2015 కన్యా రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి....
, బుధవారం, 31 డిశెంబరు 2014 (21:36 IST)
ఉత్తర 2, 3, 4 పాదములు (టో, పా, పి)
హస్త 1, 2, 3, 4 పాదములు  (పూ, షం, ణ, ఢ)
చిత్త 1, 2 పాదములు (పే, పో)
ఆదాయం 11, వ్యయం 5, పూజ్యత 4, అవమానం 5

 
కన్యా రాశివారికి జూలై 14 వరకు లాభము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా, వ్యయము నందు, ఈ సంవత్సరము అంతా జన్మమము నందు రాహువు, సప్తమము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా తృతీయము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'గణ లబ్దః స్వయమేవ సంపద' అన్నట్లుగా మీ మంచి గుణానికి, మంచి ప్రవర్తనకు, తెలివితేటలకు, వాక్‌చాతుర్యానికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ భాగం దైవసాన్నిధ్యాన్ని కోరుకుంటారు. కుటుంబ బాధ్యతలను స్వీకరించడం కూడా దైవకార్యక్రమంలో ఒక భాగమని గమనించండి. ఉపాధ్యాయులకు గణిత, సైన్సు రంగాల్లో వారికి శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు అభివృద్ధి కానరాగలదు. స్థిరాస్తులు అమర్చుకునే ప్రయత్నం చేయండి. 
 
ఎండుమిర్చి, నూనె, కంది, మినుము, పెసర, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. రుణాలు ఏ కొంతైనా తీర్చగలుగుతారు. మతిమరుపు పెరగడం వల్ల వస్తువులు పోగొట్టుకునే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో వారికి ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొత్తకొత్త ఆలోచనలు స్ఫురించగలవు. ఎదుటివారు ఉద్రేకపడటం వల్ల మీకు లాభం చేకూరుతుంది. 
 
స్పెక్యులేషన్ చేయువారికి జాగ్రత్త అవసరం. సినిమా కళాకారులకు సామాన్యంగా ఉండగలదు. శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు, జ్యోతిష్కులకు, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితంగా ఉండగలదు. అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. పూర్వపు పరిచయ వ్యక్తుల కలయిక మీకెంతో సంతృప్తినిస్తుంది. అభిమాన బృందాలు అధికమవుతాయి. కొత్త కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు ఆడిటర్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
విందులు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. జీడి, ప్రత్తి, పొగాకు, ఎడుమిర్చి స్టాకిస్టులు ఆర్థికంగా ఒకడుగు ముందుకు వెళతారు. క్రీడా రంగాల్లో వారికి సమస్యలు తలెత్తగలవు. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టడం మంచిది. ఈ సంవత్సరంలో మొదటి భాగంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీ చుట్టు ప్రక్కలవారితో కలిసిమెలిసి ఉండటం వల్ల పాత సమస్యలు పరిష్కరించబడతాయి. చిన్నతరహా పరిశ్రమల్లో వారు అహంభావం ప్రదర్శించడం వల్ల కార్మికులతో సమస్యలు తప్పవు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో వారికి సత్ ఫలితాలు లభించగలవు. 
 
ఈ రాశివారు 3 నెలలకు ఒక గురువారం నాడు రాహువు, కేతువులకు పూజ చేయించి, దుర్గాదేవిని ఆరాధించి, లక్ష్మీ నారాయణ స్తోత్రం పఠించడం వల్ల లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. విద్యార్థులు, విద్యాభివృద్ధికి, దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల పురోభివద్ధి పొందుతారు. 
 
** ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టును, హస్త నక్షత్రం వారు కుంకుడు చెట్టును, చిత్తా నక్షత్రం వారు తాటిచెట్టును దేవాలయాలలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాలలో కానీ నాటి ఈ చెట్ల అభివృద్ధికి దోహదపడండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
ఉత్తరా నక్షత్రం వారు జాతికెంపు లేక స్టార్‌రూబి, హస్త నక్షత్రం వారు స్పందన ముత్యం, చిత్తా నక్షత్రం వారు జాతి పగడం అనే రాయిని ధరించినా శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu