Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు 15వ తేదీ జన్మించారా.. అయితే నిరంతర భోగలాలసులే!

మీరు 15వ తేదీ జన్మించారా.. అయితే నిరంతర భోగలాలసులే!
, శనివారం, 2 మార్చి 2013 (14:09 IST)
FILE
మీరు 15వ తేదీన జన్మించారా.. అయితే నిరంతర భోగలాలసులేనని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఈ జాతకులు స్త్రీ సౌందర్యోపనాసకులు, నిరంతర భోగలాలసులుగా ఉంటారు. అయితే కరుణాహృదయం కలిగివుంటారు. వీరికి ధనవంతులమనే అహంభావం ఉంటుంది.

ఆత్మాభిమానము హెచ్చు. స్త్రీల యందు అధికమైన ప్రేమ, వ్యామోహము కలిగి వుండట వలన కొన్ని సందర్భాల్లో కష్టాలు తప్పవు. కంటికి కనిపించినదే సత్యమనుకుంటారు. నటులు, చిత్రకారులు, గాయకులుగా రాణించే ఈ జాతకులు 8 లేక 17సంవత్సరములందు అభివృద్ధి చెందుతారు.

వైద్యశాస్త్రము, న్యాయశాస్త్రవేత్తలు, రసాయనిక శాస్త్రవేత్తలు, విద్యుత్ మరియు అణుశాస్త్ర వేత్తలుగానూ రాణిస్తారు. ఈ తేదీన పుట్టిన స్త్రీలు అందగత్తెలు. సినీరంగమందు వృత్తి కలిగి విశేష ధనమును, అఖండ కీర్తిని సంపాదించగలరు. కొందరు 42వ సంవత్సరము తర్వాత ఆధ్యాత్మిక చింతన గలవారుగా ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu